ఓవర్ నైట్ స్టార్ అంటుంటారు చూడండి… ఆ ఇమేజ్ సంపాదించించి, ఆ తర్వాత దానిని స్టార్ ఇమేజ్‌గా మార్చుకోవడం చాలా కష్టం. ఒకవేళ స్టార్ ఇమేజ్ వచ్చినా.. దానిని కొనసాగించడం ఇంకా కష్టం. ఒకవేళ ఈ పని చేయకపోతే అమాంతం కిందపడతారు. కొంతమంది ఇలా పడి మళ్లీ లేవలేదు. ఇప్పుడు యంగ్ అండ్ హైలీ టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఓ తమిళ దర్శకుడి పరిస్థితి ఇలా మారిపోతోందా? ఆయన రీసెంట్ సినిమాల ఫలితాలు చూస్తుంటే ఇదే అనిపిస్తోంది.
‘పిజ్జా’ లాంటి కథను పట్టుకొని, తక్కువ బడ్జెట్‌లో తీసి అందరి నీ మెప్పించాడు కార్తిక్ సుబ్బరాజు. ఆయన టేకింగ్ స్టైల్, పికింగ్ ఎలిమెంట్స్ నచ్చి చాలామంది ఫిదా అయిపోయారు. ఏమన్నా డైరక్టరా అంటూ తెగ మెచ్చేసుకున్నారు. ఆ హైప్‌ను రెండో సినిమా ‘జిగర్‌తండ’తో డబుల్ చేసుకున్నాడు. ఆ సినిమా కూడా ఔట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్‌తో చేసి కార్తిక్ సుబ్బరాజు.. వన్ ఫిల్మ్ వండర్ కాదని నిరూపించుకున్నాడు. అయితే ఆ తర్వాత కార్తిక్ మ్యాజిక్ తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు రొడ్డ తమిళ సినిమా డైరక్టర్ అనిపించుకుంటున్నాడు.
కార్తిక్ సుబ్బరాజు మూడో సినిమా చూసుకుంటే… ‘ఇరైవి’. తొలి రెండు సినిమాలతో పోలిస్తే ఇది అంత పెద్ద విజయం అందుకోకపోయినా… మంచి సినిమా అనిపించుకుంది. ఆ వెంటనే వచ్చిన ‘మెర్క్యూరీ’ పరిస్థితి అంతే. కాస్త బాగుందని ఫీడ్ బ్యాక్ వచ్చినా… కార్తిక్ మ్యాజిక్ లేదన్నారు. ఆ తర్వాత కార్తిక్ చూపు స్టార్ హీరోలవైపు పడిందో, లేక స్టార్ హీరోల చూపు కార్తిక్ మీద పడిందో కానీ… దిష్టి కన్ను మాత్రం బాగా పడింది. ఐదో సినిమా ఘోరంగా దెబ్బ తీసింది. అదే రజనీకాంత్ ‘పేట’. భారీ అంచనాలతో తీసిన ఈ సినిమా అందరినీ నిరాశపరిచింది. ఇప్పుడు ఆరో సినిమా ‘జగమే తంత్రం’. దీని ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఐదో సినిమా బెడిసికొట్టినా… ధనుష్ కాబట్టి బాగానే ఉంటుంది అనుకుంటూ థియేటర్లలో అడుగుపెట్టారు… ఓ సారీ ఓటీటీలో ప్లే చేశారు ప్రేక్షకులు. ఏముంది ఓ గంట పూర్తవ్వకముందే చిరాకులు పుట్టుకొచ్చి సోషల్ మీడియాలో కార్తిక్ సుబ్బరాజును ఏకిపారేస్తున్నారు. ఇలాంటి సినిమా అసలు ఎలా ఒప్పించాడు, తీశాడు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సినిమా ఫలితం గురించి పక్కనపెడితే… కార్తిక్ సుబ్బరాజు మ్యాజిక్ అయితే మసకబారుతోంది. దీంతో తన ఫార్ములాను, పెన్ను పవర్‌ను కాస్త చెక్ చేసుకొని పాత కార్తిక్ సుబ్బరాజును వస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఎలాగూ తర్వాత చేస్తోంది విక్రమ్ సినిమా… అందులో తన పవర్ చూపిస్తే బాగుంటుంది.
Most Recommended Video
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?