Harish Shankar, Sai Dharam Tej: సాయితేజ్‌ ఇంకా ముఖం చూపించడంలేదేం…

‘సాయితేజ్‌ ఆసుపత్రి నుండి డిశ్ఛార్జి అయ్యాడు’ అంటూ ఇటీవల చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దీంతో హమ్మయ్య అంటూ అభిమానులు, శ్రేయోభిలాషులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇక్కడో ఓ చిన్న ప్రశ్న మనసుల్ని తొలిచేస్తోంది అంటున్నారు నెటిజన్లు. ఇది పెద్ద ప్రశ్న కాకపోవచ్చు కానీ… ఎందుకు అలా చేస్తున్నారు అనేదే అనుమానం. ఇప్పటివరకు సాయితేజ్‌కి సంబంధించి అప్‌డేట్లలో ఎక్కడా ముఖం చూపిచండం లేదు. ‘నేను కోలుకుంటున్నా’ అంటూ ఆ మధ్య సాయితేజ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

అందులో కేవలం థమ్స్‌అప్‌ గుర్తు వచ్చేలా వేలి ఫొటో పెట్టాడు. ఆసుపత్రిలో ఉన్నాడు కదా… అలా చేశాడు అనుకోవచ్చు. ఇటీవల సాయితేజ్‌ను దర్శకుడు హరీశ్‌ శంకర్‌ కలిశారు. అప్పుడు కూడా ఇద్దరూ చేతులు కలిపి ఉన్న ఫొటో పెట్టారు. దీంతో ‘ఎందుకు ఫేస్‌ చూపించడం లేదు’అనే ప్రశ్న మరోసారి వచ్చింది. యాక్సిడెంట్‌ తర్వాత ఆసుపత్రి వర్గాలు చెప్పిన ప్రకారం సాయితేజ్‌కు కాలర్‌ బోన్‌కు శస్త్రచికిత్స చేశారు.

ఇది కాకుండా పొట్ల మీద, ఛాతి మీద చిన్నపాటి గాయాలయ్యాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎందుకు సాయితేజ్‌ తేజ్‌ ముఖం చూపించడం లేదో అర్థం కావడం లేదు. మరీ అంతలా ముఖం మీద గాయాలయ్యయా? లేక ఎందుకు చూపించడం అనుకున్నారో తెలియడం లేదు. వీలైనంత త్వరగా మన సాయితేజ్‌ అందరి ముందుకు రావాలని కోరుకుందాం.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus