టాలీవుడ్‌ – ఏపీ ప్రభుత్వం మధ్య ఇంకా తేలలేదా…

Ad not loaded.

టాలీవుడ్‌కి కరోనా తర్వాత వచ్చిన అతి పెద్ద కష్టం ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్లు, ప్రదర్శనకారులు ఎదుర్కొంటున్న సమస్యలు. పైకి అంతా ఓకే అంటూనే… లోలోపల నిర్మాతలు ఇబ్బందిపడుతున్నారు పరిశీలకులు. కారణం ఆన్‌లైన్‌ టికెటింగ్‌ పోర్టల్‌ అని తెలుస్తోంది. ప్రభుత్వం మాతో చర్చించే నిర్ణయం తీసుకుందని నిర్మాతలు చెబుతున్నారు. అయితే దానికి ఇది సరైన సమయం కాదనే వాదనలూ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలోనూ ఎక్కువ శాతం ఆన్‌లైన్ టికెటింగ్‌ పోర్టల్‌తోనే పని చేస్తున్నాయి.

అయితే అవి ప్రైవేటు సంస్థలకు చెందినవి. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, థియేటర్ల యాజమాన్యాలు ఇలా అందరూ టికెటింగ్‌ పోర్టల్‌తో డీల్‌ కుదుర్చుకొని ఉన్నారు. వాళ్లు ఏ రోజుకారోజు టికెట్‌ డబ్బులు సెటిల్‌ చేసేస్తున్నారట. దీంతో ఇప్పుడు ప్రభుత్వ పోర్టల్‌ వస్తే పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారట. పెద్ద సినిమాల విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో మరోసారి టాలీవుడ్‌ పెద్దలు ఏపీ ప్రభుత్వ పెద్దలతో కలుస్తున్నారు. వేర్వేరు కారణాలు చెబుతున్నా అగ్ర నటుడు నాగార్జున, నిర్మాతలు నిరంజన్‌ రెడ్డి,

దిల్ రాజు, బన్ని వాసు, వంశీ లాంటివాళ్లు కలసింది దీని కోసమే అని టాక్‌. ఆన్‌లైన్‌ టికెటింగ్ కంటే ముందే టికెట్‌ రేట్లు పెంచాలని కూడా వాళ్లు కోరుతున్నారని అంటున్నారు. మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus