ఆర్ డి ఎక్స్ లవ్ కథను ఒకేసారి విని సైన్ చేసిందట

“ఆర్ ఎక్స్ 100” సినిమా తర్వాత పాయల్ రాజ్ పుట్ కి వచ్చిన క్రేజ్ & స్టార్ డమ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ సినిమా విడుదలైన తర్వాత ఆమె చేసిన ఈవెంట్స్ కి వచ్చిన మొత్తంతో ఒక మీడియం బడ్జెట్ సినిమా తీయొచ్చు.. అంతలా సంపాదించింది పాయల్. అలాంటి పాయల్ కి తెలుగులో భారీగానే ఆఫర్లు వచ్చాయి. కానీ అమ్మడు చాలా సెలక్టివ్ గా “ఆర్ డి ఎక్స్ లవ్” అనే సినిమా సైన్ చేసింది. ఆ సినిమాతోపాటు “డిస్కో రాజా, వెంకీ మామా” చిత్రాలు కూడా సైన్ చేసినప్పటికీ.. ఆ రెండు సినిమాల్లోనూ అమ్మడు సెకండ్ హీరోయిన్. అయితే.. ఇటీవల విడుదలైన “ఆర్ డి ఎక్స్ లవ్” టీజర్ చూసిన వాళ్ళందరూ “ఇదేంటి మరీ బీగ్రేడ్ సినిమాలా ఉంది” అని పెదవి విరిచారు. ఇక పాయల్ ఈ తరహా సినిమాలే చేస్తదా? అని ప్రశ్నించారు కూడా.

అయితే.. అందరూ అనుకొంటున్నట్లు “ఆర్ డి ఎక్స్ లవ్” ఆ తరహా సినిమా కాదని, కేవలం ఆసక్తి రేకెత్తించడం కోసమే టీజర్ ను అలా కట్ చేశారు కానీ.. సినిమాలో మంచి పాయింట్ ఉందని, అది నచ్చే కేవలం ఒక నేరేషన్ కే కథను ఒకే చేశానని చెబుతోంది పాయల్. ఈ సినిమాలో ఆమె అలివేలు అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించబోతోంది. మరి పాయల్ అంతగా ఇంప్రెస్ అయిన పాయింట్ ఏమిటనేది చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus