Rakul Preet: ఇంత ఇంట్రెస్టింగ్‌ విషయం బయటకు రాలేదేంటబ్బా!

సినిమా ఇండస్ట్రీ అంటే… ప్రేమాయణాలు కొత్తేం కాదు. కొత్త సినిమా మొదలైనంత సులభంగా ప్రేమాయణాలు మొదలవుతూ ఉంటాయి. అయితే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది అనే విషయంలో ఆ ఇంట్లో తెలిసేకంటే ముందుగానే మీడియాకు తెలిసిపోతుంది. ఇంకేముంది ‘ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది’ అంటూ చిన్న టాపిక్‌ లేవదీస్తారు. కొద్ది రోజులకు ఇది ఉంది, అది ఉంది, ఇంకేదో ఉంది అంటూ కథనాలు వచ్చేస్తాయి. కానీ రకుల్‌ప్రీత్‌ విషయంలో మాత్రం ఇలా జరగలేదు ఎందుకో.

బాలీవుడ్‌ ప్రేమాయణాలను క్లోజ్‌గా ఫాలో అయ్యేవాళ్లకు మేం చెబుతున్న విషయం బాగా తెలుసు. ఓ హీరో, హీరోయిన్‌ కలసి లేట్‌నైట్‌ డిన్నర్‌కి వెళ్తే… క్షణాల్లో తెలిసిపోతుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. వెబ్‌ మీడియాలో వార్త అయిపోతుంది. కథానాయికలు జిమ్‌కి వెళ్తేనే… ఫొటోలు తీయకుండా వదలని రోజులివి. అలాంటిది ఓ హీరోయిన్‌, కుర్ర నిర్మాత కలసి బయట తిరుగుతుంటే ఎలా వదిలేశారబ్బా. బాలీవుడ్‌లో ప్రేమాయణాలను దాచడం అంత సులభం కాదు.

ఇద్దరూ కలసి ఓ చోట కనిపిస్తే… ఫలానా తేదీన ఎంగేజ్‌మెంట్‌, ఆ స్పెషల్‌ డేనాడు పెళ్లి అని రాసేస్తుంటారు. అలాంటిది రకుల్‌ప్రీత్‌, జాకీ భగ్నానీ ప్రేమకథను బాలీవుడ్‌ మీడియా, సోషల్‌ మీడియా ఎందుకు పసిగట్టలేదో తెలియడం లేదు. రకుల్‌ ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌లో సినిమాలు చేస్తోంది. అప్పుడే ప్రేమలో పడే అవకాశం లేదనుకున్నారో. లేక టాలీవుడ్‌లో ఇన్నేళ్లు ఉన్నా స్పష్టమైన ప్రేమకథలు లేవు కాబట్టి… ఇక్కడా ఉండవు అనుకున్నారేమో. కానీ అందరి అంచనాలను తలకిందుల చేస్తూ… రకుల్‌ అందరికీ షాక్‌ ఇచ్చింది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus