మిస్ట‌ర్ క‌మెడియ‌న్ ఫ్యూచ‌ర్.. ఇదే ఇప్పుడు సెన్షేష‌న్ మ్యాట‌ర్..!

  • November 5, 2020 / 09:29 PM IST

బుల్లితెర పై జ‌బ‌ర్ధ‌స్త్ కామెడీ షో ఏ రేంజ్‌లో దూసుకుపోతుందో అంద‌రికీ తెలిసిందే. జ‌బ‌ర్ధ‌స్త్ లాంటి పెద్ద ప్లాట్‌ఫామ్‌లో అవ‌కాశం దొర‌కాలంటే అదృష్టం ఉండాలి. అక్క‌డ నిల‌దొక్కుకోవాలంటే త‌న‌దైన కామెడీ టైమింగ్ ఉండాలి. ఒక్క‌సారి బ్రేక్ వ‌స్తే ఇక వారికి తిరుగుండ‌దు. ఇక అస‌లు విష‌యం ఏంటంటే.. జ‌బ‌ర్ధ‌స్త్‌లో అవినాష్ అండ్ కెవ్వు కార్తిక్ ఇద్ద‌రు లీడ‌ర్లుగా ఒకే టీమ్‌ను లీడ్ చేస్తూ త‌మ‌దైన స్కిట్‌ల‌తో కామెడీ పండిస్తూ త‌మ‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇటీవ‌ల బిగ్‌బాస్‌లో అవ‌కాశం రావ‌డంతో, జ‌బ‌ర్ధ‌స్త్‌కు బ్రేక్ ఇచ్చి మ‌రీ బిగ్‌బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే బిగ్‌బాస్‌లో అవినాష్ జ‌ర్నీ అయ్యాక, అత‌డికి జ‌బ‌ర్ధ‌స్త్‌లో ఎంట్రీ ఉంటుందా అనే విష‌యం పై పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది. మామూలుగా జ‌బ‌ర్ధ‌స్త్‌లో చేసే క‌మెడియ‌న్లు గ‌తంతో ఆ షో నుండి బ‌య‌కు వెళ్ళి, మ‌ళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి.

అయితే జ‌బర్ధ‌స్త్‌లో త‌న‌కు రీ ఎంట్రీ చాన్స్ లేద‌ని అవినాష్ చెప్పాడం హాట్ టాపిక్‌గా మారింది. గ‌త రెండు వారాలుగా బిగ్‌బాస్ హౌస్‌లో హౌస్‌మేట్స్ పై విప‌రీతంగా ఫైర్ అవుతున్న అవినాష్, ఎలిమినేష‌న్ టైమ్‌లో తాను ఎలిమినేట్ అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని, జ‌బ‌ర్ధ‌స్త్ పేరు చెప్ప‌కుండా త‌న‌ని వేరే షో వాళ్ళు రావొద్ద‌ని చెప్పార‌ని, దీంతో బిగ్‌బాస్ టైటిల్ గెల‌వ‌డం త‌న‌కు చాలా ఇంపార్టెంట్ అని హౌస్‌మేట్స్ వ‌ద్ద బాద‌ప‌డ‌డంతో ఈ మ్యాట‌ర్ ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌చ్చింది. దీంతో నిజంగా జ‌బ‌ర్ధ‌స్త్ యాజ‌మాన్యం అవినాష్‌కు నో ఎంట్రీ బోర్డు పెట్టారా అనే ఆనుమానం వ‌స్తుంది. అయితే జ‌బ‌ర్ధ‌స్త్ లాంటి పాపుల‌ర్ షోలో త‌న‌కంటూ ఓ ఇమేజ్ వ‌చ్చాక, ఆ షోలో త‌న జ‌ర్నీ సాఫీగా సాగుతున్న నేప‌ధ్యంలో అవినాష్ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఎందుకు వ‌చ్చాడని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు.

గ‌తంలో అనేక‌సార్లు తాను జబర్ధస్త్ షో‌లో ఎంట్రీ ఆ త‌ర్వాత‌ టీమ్ లీడర్ స్థాయికి రావడానికి ఎంతగానో కష్టడ్డాన‌ని చెప్పిన‌ అవినాష్‌కు బిగ్‌బాస్ ఎంట్రీ ప్రతికూలంగా మార‌డానికి కార‌ణం ఏమై ఉంటుంద‌నే దాని పై కూడా చ‌ర్చ జ‌ర‌గుతోంది. అవినాష్ ప్లేస్‌లో వ‌చ్చిన ఇమ్మానుయేల్ త‌క్కువ టైమ్‌లోనే బాగా పాపుల‌ర్ అయ్యాడు. దీంతో ఆ టీమ్‌లో లీడ‌ర్‌గా అవినాష్‌కు అవ‌కాశం రావ‌డం క‌ష్ట‌మంటున్నారు. టీమ్ లీడ‌ర్‌గా కాక‌పోయినా మ‌రో టీమ్‌లో వేసే చాన్స్ ఉంద‌ని కొంద‌రు అంటున్నారు. ఇక‌ మ‌రోవైపు జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడియ‌న్స్ మాత్రం అవినాష్‌కు స‌పోర్ట్ చేస్తూ ఎలిమినేష‌న్ నుండి సేవ్ చేయాలంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మ‌రి అవినాష్ బిగ్‌బాస్ విన్న‌ర్ అవుతాడా లేడా అనే విష‌యం ప‌క్క‌న పెడితే, బిగ్‌బాస్ సీజ‌న్ ముగిశాక ఈ క‌మెడియ‌న్ ఫ్యూచ‌ర్ ఎలా ఉంటుందో అనేది ఆశ‌క్తిగా మారింది. మ‌రి ఆఫ్ట‌ర్ బిగ్‌బాస్ అవినాష్‌కు జ‌బ‌ర్ధ‌స్త్‌లో ఎంట్రీ ఉంటుందా లేదా అనేది చూడాలి.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus