Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?
- September 18, 2026 / 03:50 PM ISTByFilmy Focus Desk
మొన్నీ మధ్య ‘రాకా’ సినిమా నుండి ఓ అప్‌డేట్ రాబోతోంది అంటే.. ఇప్పుడెందుకు, స్పెషలేంటి? అని అనుకున్నారంతా. కానీ ఆ రోజుకు ఉన్న స్పెషాలిటీ గురించి తెలిసేసరికి.. అప్‌డేట్ రావాల్సిందే.. మేనియా చూడాల్సిందే అని అల్లు అర్జున్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎదుర్కొన్నారు. అయితే, హీరో పుట్టిన రోజు సందర్భంగా పెద్ద అప్‌డేట్ ఇవ్వని టీమ్.. ఈ సారి డైరక్టర్ పుట్టిన రోజు సందర్భంగా భారీ అప్‌డేట్‌కి రెడీ అవుతోందట.
Raaka
ఈ మేరకు 37 అంటూ.. ఓ టీజర్ పోస్టర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. దీంతో 37 అంటే ఏంటి? అంటూ ఓ చర్చ ప్రారంభమైంది. దీన్ని డీ కోడ్ చేస్తే కొన్ని ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి. సినిమాను 2027లో ఏడో నెల మూడో తేదీన రిలీజ్ చేస్తారు అని కొందరు అంటుంటే.. ఇంకొందరు మూడో నెల ఏడో తేదీన సినిమాను తీసుకొస్తారు అని లెక్కలేస్తున్నారు. అయితే ఈ రెండూ నమ్మశక్యంగా లేకపోవడం గమనార్హం.
మరికొందరు అయితే సెప్టెంబరు 21న రాబోయే టీజర్ 37 సెకన్లు ఉండబోతోంది అని చెబుతున్నారు. అయితే ఇంత ఆలోచించొచ్చు 3 × 7 = 21 అంటే సెప్టెంబరు 21న అప్‌డేట్ ఇస్తామని అలా రాశారు ఇంకొందరు తీసిపారేస్తున్నారు. మరికొందరు అయితే ఈ సినిమాలో 37 మంది పెద్ద నటులు ఉన్నారని.. వారి వివరాలను వెల్లడిస్తారని ఇన్‌డైరెక్ట్‌గా చెబుతున్నారు అని అంటున్నారు. లేదంటే ఆ రోజు నుండి పోస్టర్ల రిలీజ్ ఉండబోతోంది అని కూడా చెబుతున్నారు.
సన్ పిక్చర్స్ రూ.800 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రం ‘రాకా’. ఈ సినిమాలో బన్నీ సరసన దీపికా పడుకొణెన నటిస్తోంది. ఇతర ముఖ్య పాత్రల్లో మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ నటిస్తున్నారు అని సమాచారం. ఇందులో బన్నీ మృగం అవతారంలో కనిపించనున్నాడని ఫస్ట్ లుక్ చూస్తే అర్థమైంది. అది కూడా మరికొన్ని అవతారాల్లోనూ కనిపిస్తాడని అంటున్నారు. ఇక ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు.
















