Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Advertisement

‘పెద్ది’ సినిమా వాయిదా విషయాన్న చిత్రబృందం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇంకా అప్‌డేటడ్‌ రిలీజ్‌ డేట్‌కి మూడు వారాలే ఉన్న నేపథ్యంలో వాయిదా కన్ఫామ్‌ అనేసుకోవచ్చు. ఆ లెక్కన జూన్‌కి సినిమా వెళ్లడమూ పక్కా. ఇప్పుడు ఇదే మరో సమస్యకు కారణమవుతోంది. ఆ నెలలో వస్తాడు అనుకుంటున్న ‘విశ్వంభర’ ఇప్పుడు మరోసారి వాయిదా పడతాడా అనేది తెలియడం లేదు. ఆ మాటకొస్తే వాయిదా పడటం పక్కా. కానీ ఏం చెబుతారు, ఎప్పుడని చెబుతారు అనేది తెలియడం లేదు.

Vishwambhara

నిజానికి ‘విశ్వంభర’ సినిమా ఎప్పుడో రావాల్సింది. టీజర్‌ చూశాక అభిమానుల నుండి వచ్చిన స్పందన, చిరంజీవి సన్నిహితుల నుండి వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ కారణంగా సినిమా విడుదలను వాయిదా వేసి విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలో మరోసారి పని చేయాలని నిర్ణయించుకున్నారు. దీని వల్ల సినిమా ఎప్పుడొస్తుంది అనే విషయం చెప్పకుండా ఈ ఏడాది సమ్మర్‌లో కానీ, సమ్మర్‌ తర్వాత కానీ రావొచ్చు అని చెప్పారు. అయితే ఇప్పుడు సమ్మర్‌ వచ్చేసింది.. ఇప్పటివరకు సినిమా గురించి ఎక్కడా ఎలాంటి సమాచారం లేదు.

మొన్నామధ్య తనను కలసి మీడియా మిత్రులతో చిరంజీవి మాట్లాడుతూ జూన్‌ ఆఖరున కానీ, జులైలో కానీ ‘విశ్వంభర’ రావొచ్చు అని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ డేట్‌ మీద ‘పెద్ది’ దృష్టి పడింది. ఆ లెక్కన అప్పుడు ‘విశ్వంభర’ వచ్చే అవకాశం లేదు. కాబట్టి కొత్త డేట్‌ చూడాల్సి వస్తుంది. అదే జరిగితే సినిమాకు భారీగా డ్యామేజీ జరుగుతుంది. ఇన్ని వాయిదాల తర్వాత వచ్చిన సినిమా హిట్‌ సాధించిన దాఖలాలు టాలీవుడ్‌లో లేవు. ఆ మాటకొస్తే ఎక్కడా లేవు.

ఆ లెక్కన చిరంజీవి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరోవైపు ఇప్పటికే మొదలవ్వాల్సిన చిరంజీవి – బాబి సినిమాకు ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టలేదు. నిర్మాత ఎవరు అనే సంగతి తేలకనే ఈ సినిమా ఇంకా పూర్తి స్థాయిలో అనౌన్స్‌ అవ్వడం లేదని టాక్‌.

 ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus