సోషల్ మీడియాలో వైవిధ్యమైన పోస్టులు, యోగా పోజులతో ఎప్పుడూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా ఉంటుంది శిల్పా శెట్టి. అయితే ఇప్పుడు ఆమె భర్త రాజ్ కుంద్రా టాక్ ఆఫ్ ది ఇండియా అయి కూర్చున్నారు. కారణం ఆయన్ను అశ్లీల చిత్రాల రాకెట్ కేసులో పోలీసులు అరెస్టు చేయడమే. అయితే రాజ్ కుంద్రా విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఆయన రూపొందిస్తున్నారు అని చెబుతున్నవి అశ్లీల చిత్రాలేనా అనే ప్రశ్న ఒకటి వస్తోంది.
బాలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం చూసుకుంటే… రాజ్ కుంద్రా, అతని టీమ్ ముంబయి శివారులోని ఓ దీవిలో ఉన్న ఇంట్లో కొన్ని వీడియోలు రూపొందిస్తోంది. వాటిని ఇతర దేశాల్లో ఉన్నతమ మిత్రులు/పార్టనర్స్‌కు పంపించి ఓ యాప్‌లో అప్లోడ్ చేస్తున్నారు. అయితే వాళ్లు చిత్రీకరిస్తున్నవి పోర్న్ ఫిల్మ్స్ ఆ.. కాదా అనేదే ఇక్కడ ప్రశ్న. చాలామంది రాజ్‌కుంద్రా నిర్మిస్తున్న సినిమాలు చూసి… అవి పోర్న్ సినిమాలా… లేక ఎరోటిక్ సినిమాలా అనేది చూడాలని కోరుతున్నారు.
పోర్న్ సినిమాలకు, ఎరోటిక్ సినిమాలకు చాలా తేడా ఉందని… కాబట్టి చూడకుండా ఓ నిర్ణయానికి రాకూడదనేది వారి వాదన. ఈ క్రమంలో కాఖీ సావంత్, మికాసింగ్, గెహనా వశిష్ట్ లాంటివాళ్లు రాజ్ కుంద్రాకు మద్దతు తెలుపుతున్నారు. మికా సింగ్ అయితే… రాజ్ కుంద్రా రూపొందించిన కొన్ని వీడియోలు చూశానని… అయితే అవి కేసులు పెట్టేంతవి కావని అంటున్నారు. బాలీవుడ్లో ఏక్తా కపూర్ ఇలాంటి ఎరోటికా వీడియోలకు పెట్టింది పేరు. ఆమెకు ALT పేరుతో ఓ యాప్ కూడా ఉంది. అందులో విచ్చలవిడిగా అడల్ట్ కంటెంట్ ఉంటుంది.
ఇప్పుడు రాజ్ కుంద్రా కూడా అలాంటి సీరిస్లే తీసి.. యాప్‌లో ప్రమోట్ చేస్తున్నారని కొంతమంది బాలీవుడ్ పరిశీలకులు, నటులు అంటున్నారు. రాజ్ కుంద్రాపై నటి పూనమ్ పాండే గతంలో ఫిర్యాదు చేసింన విషయం తెలిసిందే. ఆమె ఆ సమయంలో రాజ్ కుంద్రా వీడియోల్లో నటించింది. ఆ తర్వాత లావాదేవీల్లో తేడాలు రావడంతో ఫిర్యాదు చేసింది. అంతే కానీ తప్పుడు పనులు చేయిస్తున్నారని కాదు అంటూ కొంతమంది గుర్తు చేస్తున్నారు.