టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు నిర్మాతగానూ.. మరో వైపు బిజినెస్ మేన్ గానూ రాణిస్తున్నాడు. ‘ఏ.ఎం.బి’ సూపర్ ప్లెక్స్ తో పాటూ నిర్మాతగానూ ‘జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ను స్థాపించాడు. వీటి వ్యవహారాలన్నీ మహేష్ బాబు సతీమణి నమ్రత దగ్గరుండి చూసుకుంటున్నప్పటికీ… వెనుక నుండీ నడిపించేది మహేష్ బాబే అని అందరికీ తెలిసిన విషయమే. ‘మహర్షి’ చిత్రాన్ని పివిపి కి చేయాల్సిన రెండు సినిమాలు (ఒకటి అగ్రిమెంట్, ఒకటి బ్రహ్మోత్సవం డిజాస్టర్ కు బదులు) అశ్వనీదత్ కు చేయాల్సిన ఒక సినిమా, దిల్ రాజు చేసే మూడు సినిమాలలో రెండో సినిమా… ఇలా మొత్తం నాలుగు సినిమాల అగ్రిమెంట్ ను ఒక్క సినిమాతో కంప్లీట్ చేసేస్తున్నాడు.
ఇక ప్రస్తుతం మహేష్ బాబు….. అనిల్ సుంకర-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తన 26 వ చిత్రాన్ని చేయబోతున్నాడని… ఈ చిత్రంలో దిల్ రాజు ను కూడా పార్టనర్ ని చేసేసి…. దిల్ రాజు తో ఉన్న అగ్రిమెంట్ ను కూడా ఫినిష్ చేసేయాలని మహేష్ భావించాడట. అయితే ఈ సారి కూడా కో ప్రొడ్యూసర్ గా ఉండి షేర్ తో సరిపెట్టుకోవడానికి దిల్ రాజు నిరాకరించాడని తెలుస్తుంది. దీంతో ‘మహర్షి’ తరువాత.. ఈ సంవత్సరం మరో నాలుగయిదు చిన్న ప్రాజెక్టులు టేకప్ చేస్తూ బిజీగా ఉన్నానని చెప్పి, ఈ ప్రాజెక్టు నుండీ దిల్ రాజు తప్పించుకున్నాడని సమాచారం. ఇలా బాబు ఎత్తుకి.. దిల్ రాజు పై ఎత్తు వేసి తప్పించుకుని… తనతో ఉన్న ఒక్క చిత్రం అగ్రిమెంట్ ని కాపాడుకున్నాడన్న మాట. ఏమైనా దిల్ రాజు తెలివే.. తెలివి అంటూ ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.