అందరూ సంక్రాంతే అంటున్నారు? గిల్డ్‌ ఏం చేస్తోందో?

  • December 18, 2023 / 07:55 PM IST

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని థియేటర్లు ఉన్నాయి, మామూలు రోజుల్లో ఎన్ని సినిమాలు ఒకే డేట్‌కి లేదా వీకెండ్‌కి రిలీజ్ చేస్తే థియేటర్లు సరిపోతాయి. పండగ రోజుల్లో రిలీజ్‌ చేస్తే ఆ థియేటర్ల పరిస్థితి ఏంటి? ఇలాంటి ప్రశ్నలు మనం వింటూనే ఉంటాం. అలాంటిది సినిమా నిర్మాతలకు ఈ విషయం తెలియదా అంటే కచ్చితంగా తెలుసు అనే సమాధానమే వస్తుంది. అయితే ఇంత తెలిసినా ఏటా సంక్రాంతి సీజన్‌కి వచ్చేసరికి ఎందుకు ఇలా చేస్తున్నారు. కన్‌ఫ్యూజ్‌ అవుతున్నారా? కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నారా?

గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో ఈ విషయం గురించే చర్చ నడుస్తోంది. సంక్రాంతి సినిమాలు ఏంటి అనే విషయంలో క్లారిటీ వచ్చినట్లే వచ్చి మళ్లీ కన్‌ఫ్యూజన్‌ రావడమే దానికి కారణం. ప్రస్తుతం ఉన్న లెక్క ప్రకారం చూస్తే సంక్రాంతికి ఐదు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ల ‘గుంటూరు కారం’ సినిమాను సంక్రాంతికే తీసుకొస్తాం అంటూ నిర్మాత నాగవంశీ అవకాశం వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉన్నారు. ఇక డిసెంబరు 8న రావాల్సిన ‘సైంధవ్‌’ (Saindhav) కూడా సంక్రాంతికి వెళ్లిపోయాడు.

పై రెండు సినిమాలకు థియేటర్ల సమస్య వచ్చే పరిస్థితే లేదు. ఇక లిస్ట్‌లో ఉన్న మూడో సినిమా రవితేజ ‘ఈగిల్‌’. చాలా రోజుల క్రితమే ఈ సినిమా సంక్రాంతికి అని చెప్పేశారు. ప్రచారం కూడా షురూ చేశారు. మిగిలిన నాలుగో సినిమా ‘హను – మాన్‌’. ప్రశాంత్‌ వర్మ, తేజ సజ్జాల ఈ సినిమాను ఎలాగైనా సంక్రాంతి సీజన్‌లోనే తేవాలని అనుకుంటున్నారట. దానికి చాలా కారణాలు ఉన్నాయి అని చెబుతున్నారు. అయోధ్య రామ జన్మభూమి ప్రతిష్ఠ కార్యక్రమం లోపు ఆ సినిమా విడుదల చేయాలన్నది ప్లాన్ అట.

దీంతో సంక్రాంతి సినిమాల రచ్చ మొదలైంది. గతంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, అంతెందుకు ఈ ఏడాది సంక్రాంతి సమయంలో కూడా నిర్మాతలు, నిర్మాతల గిల్డ్‌ మాట్లాడి పరిస్థితిని సరి చేశారు. కానీ మళ్లీ వచ్చే సంక్రాంతికి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఈసారైనా నిర్మాతలు ముందుగా రెస్పాండ్‌ అయ్యి కన్‌ఫ్యూజ్‌ లేకుండా చూసుకుంటే అభిమానులకు అదే పండగ.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus