Mahesh Babu: మహేష్ తొందరపడట్లేదా? లేక ఆప్షన్ లేదా..?

స్టార్ హీరోలు ఒక సినిమా కంప్లీట్ అవ్వకముందే మరో సినిమా సెట్ చేసుకోవడం అనేది సర్వసాధారణమైన విషయం. వరుసగా క్రేజీ ప్రాజెక్టులు సెట్ చేసుకుని వాళ్ళు బిజీగా గడుపుతుండాలి. అభిమానులు కూడా హీరోల లైనప్ ను బట్టి.. సంతోషిస్తూ ఉంటారు. ఇవన్నీ చాలా ముఖ్యం. అందుకే రాజమౌళి  (S. S. Rajamouli) వంటి పాన్ వరల్డ్ దర్శకుడితో సినిమా చేస్తూ కూడా.. శంకర్ (Shankar) దర్శకత్వంలో సినిమా సెట్ చేసుకున్నాడు చరణ్  (Ram Charan). ఆ వెంటనే బుచ్చిబాబు (Buchi Babu Sana)  , సుకుమార్ (Sukumar)..లతో సినిమాలు అనౌన్స్ చేశాడు.

Mahesh Babu

ఇక ఎన్టీఆర్ (Jr NTR)  కొరటాల (Koratala Siva), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) వంటి దర్శకులతో సినిమాలు సెట్ చేసుకున్నాడు. మధ్యలో ‘వార్ 2’ వంటి బాలీవుడ్ ప్రాజెక్టు కూడా సెట్ చేసుకుని ఫినిష్ చేసేస్తున్నాడు. అల్లు అర్జున్ (Allu Arjun) కూడా అట్లీ (Atlee Kumar), త్రివిక్రమ్ (Trivikram), సందీప్ వంగా (Sandeep Reddy Vanga) వంటి వాళ్ళతో సినిమాలు సెట్ చేసుకున్నాడు. ప్రభాస్ (Prabhas)  , పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..ల చేతిలో కూడా వరుస ప్రాజెక్టులు ఉన్నాయి. ఎటొచ్చి మహేష్ బాబు (Mahesh Babu) ఒక్కడే రాజమౌళి ప్రాజెక్టుకే పరిమితమయ్యాడు. ఈ 3 ఏళ్ళు అతను ఈ సినిమాతోనే బిజీగా గడుపుతాడు.

నెక్స్ట్ ప్రాజెక్టుకి అతను కమిట్ అయ్యింది లేదు. ఇది అతని అభిమానులను కూడా కొంత కన్ఫ్యూజ్ చేస్తుంది. మహేష్ వద్ద ‘మైత్రి’ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వాళ్ళ అడ్వాన్సులు ఉన్నాయి. ‘ఏషియన్ సంస్థ’ అధినేతల్లో ఒకరైన సునీల్ నారంగ్ తో కూడా సినిమా చేస్తానని మాట ఇచ్చారు. అయితే రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ప్రాజెక్టు 2 భాగాలుగా చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. సో మొదటి భాగం రిలీజ్ కావాలంటే.. 2027 వరకు టైం పట్టొచ్చు.

ఆ తర్వాత 2వ భాగం వచ్చేసరికి 2029 కావచ్చు. అందుకే ఇప్పట్లో మహేష్ ఇంకో దర్శకుడికి హోప్స్ ఇవ్వడం లేదు. తన పూర్తి ఫోకస్ రాజమౌళి సినిమాపైనే పెట్టాడు. మహేష్ కంటే వెనుక ఉండే అల్లు అర్జున్, ఎన్టీఆర్, చరణ్..లు కూడా పాన్ ఇండియా స్టార్లు అయిపోయారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా పాన్ ఇండియా స్టార్. అందుకే మహేష్ కూడా పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకోవాల్సిన టైం ఇది. అందుకే అతను తొందరపడట్లేదు.

ఆమెను అమ్మ అనే పిలుస్తాడట.. కల్యాణ్‌రామ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus