Actress Rekha: సీనియర్ హీరోయిన్ అన్ని ఇబ్బందులు పడిందా..?

సినీ పరిశ్రమలో ప్రేమించుకోవడాలు, విడిపోవడాలు చాలా కామన్. ఇండస్ట్రీలో చాలా లవ్ ట్రాక్ లు నడుస్తుంటాయి. దానికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉంటాయి. 1970లో కూడా ఇలాంటి ప్రేమ వార్తలు వినిపించేవి. వాటిల్లో ప్రముఖంగా హీరోయిన్ రేఖ ప్రేమ కబుర్లు వినిపించేవి. నటిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న రేఖ.. ఎక్కువగా లవ్ ఎఫైర్స్ తో వార్తల్లో నిలిచేది. అప్పట్లో రేఖ.. వినోద్ మెహ్రాతో పీకల్లోతు ప్రేమలో ఉండేది. కానీ ఆయన కుటుంబం మాత్రం రేఖను అంగీకరించలేదు.

ముఖ్యంగా వినోద్ తల్లి వీరిద్దరి బంధాన్ని గట్టిగా వ్యతిరేకించేవారు. రేఖ పట్ల ఆమె వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉండేదో తెలిపే సంఘటన తెలుసుకుందాం. వినోద్-రేఖ ఎవరికీ చెప్పకుండా రహస్యంగా కోల్‌కతాలో వివాహం చేసుకున్నారు. అనంతరం వినోద్ మెహ్రా.. రేఖను తీసుకొని తన ఇంటికి వచ్చాడు. తల్లికి తాను పెళ్లి చేసుకున్న విషయం చెప్పాడు. ఈ వార్త విని మండిపడ్డ ఆమె.. రేఖ మీద కోపంతో తన చెప్పు తీసుకొని రేఖను కొట్టడానికి వెళ్లారు.

తల్లిని శాంతిపజేయడానికి వినోద్ మెహ్రా ఎంతో ప్రయత్నించాడు. కానీ ఆమె కోపం చల్లారలేదు. రేఖను తీవ్రంగా అవమానించారు. వీటిని తట్టుకోలేకపోయిన రేఖ.. కన్నీరు పెట్టుకుంటూ వినోద్ ఇంటి నుండి వెళ్లిపోయారు. ఇంత గొడవ జరిగిన తరువాత కొన్నాళ్లపాటు వినోద్-రేఖ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆ తరువాత ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారు. వినోద్ తల్లి తనను కోడలిగా అంగీకరించడానికి ఇష్టపడలేదని గతంలో రేఖ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ తరువాత ముఖేష్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది రేఖ. అతడు పెళ్లైన కొన్ని నెలలకే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంలో కూడా అందరూ రేఖనే తప్పుబట్టారు.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus