మన తారలు తొలిసారి ప్రేమలో ఎప్పుడు పడ్డారంటే ?

‘లబ్ డబ్ హార్ట్ బీట్ లవ్ లవ్ అన్నదంటే.. హై క్లాసు, లో క్లాసు చూసుకోదు ప్రేమ కేసు.. తమ్ముడూ, అరె తమ్ముడూ’ అంటూ మెగాస్టార్ చిరంజీవి మాస్టారు ఎప్పుడో ప్రేమ పాఠాలు చెప్పారు. ఆయన చెప్పినదాంట్లో వంద శాతం నిజముంది. ఈ ప్రేమ ఎప్పుడు, ఎలా, ఎవరిమీద పుడుతోందో ఎవరూ కరక్ట్ గా చెప్పలేము. ఇక తొలి ప్రేమ సంగతి చెప్పనక్కర్లేదు. వయసుతో సంబంధం లేకుండా గిలిగింతలు పెట్టేస్తోంది. ఆ అనుభవం మన స్టార్స్ కి కూడా ఉన్నాయి. మరి వారి తొలి ప్రేమ విషయాలేంటో తెలుసుకుందామా ..!!.

మహేష్ బాబు అమెరికాకు చెందిన నటి డెమీ మూరె తనని బాగా ఆకర్షించిందని సూపర్ స్టార్ మహేష్ బాబు వెల్లడించారు. డెమీని ప్రేమించడానికి కారణం ఆమె డైనమిక్ ఆటిట్యూడ్ అని మహేష్ మీడియాతో చెప్పారు.

అల్లు అర్జున్ అల్లు అర్జున్ స్నేహ రెడ్డి తో ప్రేమలో పడక ముందు బాలీవుడ్ నటి, ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ ని చాలా గాఢంగా ప్రేమించాడంట. ఆమె అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకున్నప్పుడు గుండె పగిలిందని తన ఫస్ట్ క్రష్ వివరాలను స్టైలిష్ స్టార్ ఓ సందర్భంలో చెప్పారు.

తమన్నా మిల్కీ బ్యూటీ తమన్నా ప్రేమిస్తే ఎవరైనా రిజక్ట్ చేస్తారా? నో చెప్పడానికి అసలు మనసే రాదు. కానీ తమన్నా సినిమాల్లోకి రాకముందు తన అన్న ఫ్రెండ్ ని ప్రేమించింది. ఆ సమయంలో అతను తమన్నాను పట్టించుకోలేదంట. చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ..!

ప్రభాస్ డార్లింగ్ ప్రభాస్ తొలి ప్రేమ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. అతను చెన్నై లోని డాన్ బాస్కో స్కూల్ లో చదువుతున్న సమయంలో ఓ టీచర్ ని మనసుపడ్డాడంట. ఆ విషయం చెబితే ఆమె కోప్పడుతుందని చెప్పలేదని ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ చెప్పారు.

నితిన్ శృతిహాసన్ ని చూసి తొలిసారి తన గుండె జారీ గల్లంతయిందనీ పూజ రిలీజ్ వేడుకలో అందరి ముందు యువ హీరో నితిన్ చెప్పారు.

రెజినా కాసాండ్రా రెజీనా కాసాండ్రా సినిమాల్లోకి రాక ముందు తన పక్కింటి అబ్బాయిని తెగ ప్రేమించిందంట. అతను మాత్రం చూసేవాడు కాదంట. అప్పుడు రేజీనాకి చాలా బాధగా ఉండేదని తెలిపింది. రెజినాని వదులుకున్నందుకు ఇప్పుడు అతను తెగ బాధపడుతుంటాడు.

రానా దగ్గుబాటిరానా దగ్గుబాటి తన తొలి ప్రేమ గురించి మాట్లాడుతూ ” నేను ఏడవ తరగతి చదువుతున్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ విషయాన్నీ ఆమెకు చెప్పడానికి నాకు దైర్యం చాలా లేదు. ఇన్నేళ్లకి నా క్లాస్ మేట్స్ ద్వారా ఆమెనుంచి నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆ సమయంలో నా గుండె ఎంత వేగంగా కొట్టుకుందో నాకే తెలియదు” అని వివరించారు. అదేకదా తొలి ప్రేమ పవర్.

రాజ్ తరుణ్ యువ హీరో రాజ్ తరుణ్ కి సమంత అంటే పిచ్చ ప్రేమ. హీరోగా మారినా కూడా ఆ ప్రేమ తగ్గలేదు. ఆమెతో కలిసి నటించాలని ఆశ పడుతున్నాడు. కలిసి నటించడానికి సమంత ఒప్పుకున్నా.. నాగ చైతన్య ఒకే చెబుతాడా?.. కష్టమే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus