Rajamouli, Mahesh Babu: ఆ విషయాలపై జక్కన్న క్లారిటీ ఎప్పుడో?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి తన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రిలీజైన తర్వాత మాత్రమే తర్వాత సినిమా పనులను మొదలుపెడతారనే సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆర్ఆర్ఆర్ ఎప్పుడు విడుదలవుతుందో రాజమౌళి సైతం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది రిలీజ్ కానుండగా సంక్రాంతికి లేదా సమ్మర్ లో ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మహేష్ రాజమౌళి కాంబో మూవీ స్క్రిప్ట్ పనులు పూర్తి కాలేదని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు స్క్రిప్ట్ అందిస్తుండగా అటు రాజమౌళికి, ఇటు మహేష్ కు స్క్రిప్ట్ పూర్తిస్థాయిలో నచ్చితే మాత్రమే ఈ సినిమా పనులు మొదలయ్యే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం. మరోవైపు మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూటింగ్ మొదలవ్వాలి. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూటింగ్ పూర్తైన తర్వాతే రాజమౌళి డైరెక్షన్ లో సినిమా మొదలవుతుంది.

ఈ రీజన్స్ వల్ల మహేష్ రాజమౌళి కాంబో మూవీ మొదలుకావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. రాజమౌళి కనీసం రెండేళ్లు అయినా సినిమాను తెరకెక్కించే అవకాశం ఉండటంతో మహేష్ రాజమౌళి మూవీ ఎప్పుడు విడుదలవుతుందో చూడాల్సి ఉంది. ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం. రాజమౌళి ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది. మహేష్ మూవీపై జక్కన్న ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాల్సి ఉంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus