Ram Charan,Upasana: మెగా డౌట్‌: అప్పుడు బన్నీ రాలేదు.. ఇప్పుడు ఈయన రాలేదు… అంతా ఓకేనా?

మెగా ఫ్యామిలీలో అంతా ఓకేనా? ఈ ప్రశ్న చాలా రోజుల నుండి సినిమా పరిశ్రమలో, సోషల్‌ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది. తొలి రోజుల్లో చిరంజీవి, పవన్ కల్యాణ్‌ గురించి ఈ మాట అనేవారు. కొణిదెల కుటుంబంలో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు పవన్‌ కల్యాణ్‌ రాకపోవడం ఆలస్యం ఈ మాట వచ్చేసేది. ఆ తర్వాతర్వాత ఈ మాట ఆగింది. అయితే ఇప్పుడు సమస్య మెగా పవర్‌ స్టార్‌ – స్టైలిష్‌ స్టార్‌ అలియాస్‌ ఐకాన్‌ స్టార్‌ మధ్య మొదలైంది.

ఇద్దరూ ఎన్నిసార్లు తాము ఒక్కటే అని చెప్పినా, వివిధ సందర్భాల్లో చేసి చూపించినా ఇంకా ఆ ప్రశ్న వస్తూనే ఉంది. తాజాగా వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి కోసం అల్లు అర్జున్‌ – స్నేహా రెడ్డి కలసి స్పెషల్‌ పార్టీ ఇచ్చారు. దీనికి మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ దాదాపు హాజరైంది. ఒక్క రామ్‌చరణ్‌, ఉపాసన తప్ప. దీంతో రామ్‌చరన్‌ – అల్లు అర్జున్‌ మధ్య అంతా ఓకేనా? అనే ప్రశ్న మొదలైంది. నిజానికి ఇదే ప్రశ్న కొన్ని రోజుల క్రితం కూడా వచ్చింది.

అయితే అప్పుడు అందరూ వచ్చి అల్లు అర్జున్‌ కుటుంబం రాలేదు. అయితే పవన్ కల్యాణ్ కూడా రాలేదు అనుకోండి. అయితే రాజకీయాలు, సినిమాలతో బిజీ కాబట్టి రాలేదు అనుకోవచ్చు. మరి అప్పుడు బన్నీ, చరణ్‌ ఎందుకు మిస్‌ అయ్యారనేదే ప్రశ్న. రామ్ చరణ్, అల్లు అర్జున్‌కు మధ్య అంతా ఓకే అనే పరిస్థితి లేదు అనేది టాక్‌. అయితే (Upasana) ఉపాసన కోసం బన్నీ దంపతులు గిఫ్ట్‌లు పంపడం, థ్యాంక్స్‌లు చెప్పడం జరిగాయి.

కానీ ఇప్పుడెందుకు కలవలేదు అనేది ప్రశ్న. ఇక ఇక్కడే మరో ప్రశ్న ఉంది. అదే రీతూ వర్మ. ఒకప్పుడు మెగా కుటుంబంలో ఫంక్షన్లు జరిగేటప్పుడు లావణ్య త్రిపాఠి వచ్చేది. కారణం అడిగితే స్నేహితురాలు అనేవారు. కానీ ఇప్పడు ఇంటి కోడలు అయిపోయింది. మరి ఇప్పుడు రీతూ వర్మ ఎందుకొచ్చిందో తెలియాల్సి ఉంది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus