సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ట్రాక్ రికార్డ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కొంతమంది దర్శకులు కోట్లు ఖర్చు పెట్టి యాక్షన్ సన్నివేశాలు తీసి విజిల్స్ వెయిస్తారు. కానీ పూరి జగన్నాథ్ మాత్రం ఒక్క డైలాగ్ తోనే హాల్ మొత్తం విజిల్స్ వేయించేలా చేస్తాడు. ఇండస్ట్రీలో మాస్ క్లాస్ అని తేడా లేకుండా అందరి హీరోలతో వర్క్ చేశాడు. ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను సృష్టించాడు. అంతటి ట్రాక్ రికార్డ్ అనుభవం ఉన్నప్పటికీ పూరి తన కొడుకు ఆకాష్ కెరీర్ ను మాత్రం ఒక ట్రాక్ లోకి తీసుకు రాలేకపోతున్నాడు.
మొదటి సినిమా మెహబూబా దారుణమైన రిజల్ట్ ను అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా అనంతరం ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ గాడిలో పడిన పూరి తన కొడుకు కోసం ‘రొమాంటిక్’ అనే కథను సెట్ చేశాడు. అనిల్ అనే తన శిష్యుడికి డైరెక్షన్ చేసే ఛాన్స్ కూడా ఇచ్చాడు. అయితే సినిమా హ్యాపీగా కొనసాగుతున్న సమయంలో లాక్ డౌన్ దెబ్బేసింది. ఇక ఆ తరువాత ఏనాడు సినిమాపై అప్డేట్ ఇవ్వలేదు. ఆ సినిమా సంగతి ఎటు తేల్చకుండానే ఆకాష్ చేత మరో సినిమాను స్టార్ట్ చేయించారు.
జార్జిరెడ్డి దర్శకుడితో చోర్ బజార్ అనే సినిమాను గురువారం పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టారు. పూరి ఈ సినిమా కథపై చాలా నమ్మకంతో ఉన్నాడట. ఇక రొమాంటిక్ సినిమాపై ఇప్పట్లో అయితే క్లారిటీ ఇచ్చేలా లేరని తెలుస్తోంది.
Most Recommended Video
కాపటధారి సినిమా రివ్యూ & రేటింగ్!
దృశ్యం 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!