Tollywood: సంక్రాంతి జోరు.. టికెట్ రేట్ల పెంపు.. ఈ ఏడాది 300 కోట్ల సినిమాల్లో మేటి ఏది?

ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా పవన్‌ కల్యాణ్‌ – సుజీత్‌ సినిమా ‘ఓజీ’ రికార్డు సాధించింది. పవన్‌ కెరీర్‌లో ఈ స్థాయి వసూళ్లు రావడం ఇదే తొలిసారి. వసూళ్ల విషయంలో ఈ సినిమా ఎవరి రికార్డును దాటొచ్చింది అనే విషయం చూస్తే సంక్రాంతికి వచ్చిన వెంకటేశ్‌ – అనిల్‌ రావిపూడి సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ కనిపిస్తుంది. ఆ సినిమా రూ.300 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు ‘ఓజీ’ ఆ వసూళ్లను దాటి ముందుకెళ్తోంది. ఈ క్రమంలో రెండు సినిమాలను కొంతమంది కంపేర్‌ చేస్తున్నారు.

Tollywood

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు పెట్టిన టికెట్‌ ధరలు కంటే ‘ఓజీ’ సినిమాకు ధరలు చాలా ఎక్కువని అందుకే పవన్‌ సినిమాకు భారీ వసూళ్లు ఇప్పుడు వచ్చాయి అనే చర్చ నడుస్తోంది. దీనికి సమాధానంగా ఇదేం సంక్రాంతి సీజన్‌లో వచ్చిన సినిమా కాదు కదా అనే చర్చ దానికి సమాధానంగా వస్తోంది. తెలుగు సినిమాకు సంక్రాంతి సీజన్‌ లాంగ్‌ సీజన్‌ అని చెప్పొచ్చు. ఇప్పుడు ‘ఓజీ’ లాంగ్‌ వీకెండ్‌లో వచ్చినా అది లాంగ్ సీజన్‌ కాదు. అలాగే ‘ఓజీ’ సినిమాను కేవలం మాస్‌ ఆడియన్స్‌ దృష్టిలోనే తెరకెక్కింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ దృష్టిలో పెట్టుకున్నది.

దానికి తోడు ‘ఓజీ’ సినిమాకు తొలుత వచ్చిన హిట్‌ టాక్‌ ఆ తర్వాత కొనసాగలేదు. మిక్స్‌డ్‌ టాక్‌తోనే సినిమా వసూళ్లు వచ్చాయి. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా అయితే తొలి షో నుండి హిట్‌ టాక్‌తోనే నడిచింది. దీంతో భారీ వసూళ్లు సాధ్యమయ్యాయి. అలాగే ‘ఓజీ’కి కేవలం ఒక వారం మాత్రమే థియేటర్లలో సింగిల్‌ రన్‌ సాధ్యమైంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అయితే రెండు వారాలు ఏకధాటిగా ఫుట్‌ ఫాల్స్‌ సాధించింది. ఈ లెక్కన రెండు సినిమాల వసూళ్లకు వేర్వేరు కారణాలు ఉన్నాయి. ఏ సినిమా లెక్క దానిదే. ఫైనల్‌గా మనం చూడాల్సింది ఏంటంటే.. టాలీవుడ్‌కి ఈ ఏడాది రూ.300 కోట్ల సినిమాలు రెండు వచ్చాయి.

వీక్ డేస్ లో చేతులెత్తేసింది

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus