Prasanna: రైటర్‌ ప్రసన్న కొత్త సినిమా ఎవరితో.. క్లారిటీ మిస్‌!

టాలీవుడ్‌లో ప్రస్తుతం బిజియెస్ట్‌ అండ్‌ హయ్యెస్ట్‌ పెయిడ్‌ రచయితల లిస్ట్‌ తీస్తే.. బెజవాడ ప్రసన్నకుమార్‌ పేరు అందులో కచ్చితంగా ఉంటుంది. అంతలా బిజీగా ఉన్నారాయన. దాంతోపాటు పుకార్లకు తగ్గట్టే పారితోషికం కూడా అందుకుంటున్నారు. దీని బట్టి అర్థం చేసుకోవచ్చు అతని పెన్‌ జోరెంతో. అయితే ఇక్కడే ఓ అర్థం కాని విషయం ఒకటి కనిపిస్తోంది. అదే అతని తొలి సినిమా. అంటే రైటర్‌గా కాదు.. దర్శకుడిగా అన్నమాట. ప్రసన్న దర్శకుడిగా మారుతున్నారు అంటూ చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. ఒకరిద్దరు హీరోల పేర్లు వినిపించినా.. ఏవీ కన్‌ఫామ్‌ కావడం లేదు.

తాజాగా ప్రసన్న డైరక్టోరియల్‌ మూవీ గురించి రవితేజ మాట్లాడారు. ప్రసన్న కుమార్‌ రచయితగా పని చేసి, రవితేజ ప్రధాన పాత్రలో రూపొందిన ‘ధమాకా’ సినిమా త్వరలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రవితేజ ప్రసన్న గురించి చెప్పారు. స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రైటర్‌ ప్రసన్న కుమార్ బెజవాడ‌ని ప్రశంసిస్తూ.. అతను త్వరలోనే ఓ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నట్లు చెప్పాడు. అయితే అది ఎవరితో అనేది రవితేజ చెప్పలేదు. అలా అని తనతో అని కూడా చెప్పలేదు. దీంతో క్లారిటీ మిస్‌ అవుతోంది.

ప్రసన్నకుమార్‌ బెజవాడ ఇటీవల నాగార్జునను కలసి ఓ కథను వినిపించారని అంటున్నారు. దీనిపై రెండు వర్గాల నుండి క్లారిటీ లేనప్పటికీ ఎవరూ ఈ రూమర్స్‌ను కొట్టి పారేయడం లేదు. ఇప్పుడు రవితేజ ఏమో.. ప్రసన్నకుమార్ డైరక్షన్‌ గురించి బహిరంగంగానే చెప్పారు. దీంతో ప్రసన్న కుమార్‌ సినిమా అయితే ఫిక్స్‌ అయ్యిందని అర్థమవుతోంది. అయితే అది నాగార్జునతోనేనా? లేక ఇంకే హీరోనా అనేది తెలియాల్సి ఉంది. ‘ధమాకా’ విడుదల తర్వాత దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

అయితే కొత్త దర్శకులకు, తన సినిమాల్లో ఇతర విభాగాల్లో పని చేసినవాళ్లకు దర్శకుడిగా అవకాశాలు ఇవ్వడంలో రవితేజ ఎప్పుడూ ముందుంటారు. అలా రవితేజ ఏమన్నా ప్రసన్నకు ఛాన్స్‌ ఇచ్చాడా అనే డౌట్‌ కూడా ఉంది. చూద్దాం క్లారిటీ ఎప్పుడొస్తుందో?

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus