‘విజిల్’ ఫస్ట్ వీక్ కలెక్షన్లు..!

‘ఏ.జి.ఎస్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌’ బ్యానర్ పై విజయ్, నయనతార జంటగా నటించిన ‘విజిల్’ (తమిళ్ లో ‘బిగిల్’) చిత్రం నిన్న(అక్టోబర్ 25న) విడుదలయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో స్త్రీల పట్ల గౌరవాన్ని పెంచే అంశాలు ఎన్నో ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ వరకూ ఎక్కువ తమిళ వాసన కొట్టడంతో తెలుగు ప్రేక్షకులు కాస్త డీలా పడినప్పటికీ.. సెకండ్ హాఫ్ లో మాత్రం కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ మరియు ఎమోషన్స్ ను జోడించి దర్శకుడు అట్లీ మంచి మార్కులే వేయించుకున్నాడు. ఇక తెలుగులో ఈ చిత్రాన్ని ‘ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్’ అధినేత మహేష్ కోనేరు రిలీజ్ చేసాడు.

ఇక ‘విజిల్’ మొదటి వారం ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 2.7 cr
సీడెడ్ 2.28 cr
ఉత్తరాంధ్ర 0.97 cr
ఈస్ట్ 0.59 cr
వెస్ట్ 0.44 cr
కృష్ణా 0.56 cr
గుంటూరు 0.91 cr
నెల్లూరు 0.39 cr
ఏపీ + తెలంగాణ 8.84 cr

‘బిజిల్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం 8.84 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 1.20 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో వీకెండ్ ను క్యాష్ చేసుకుంటే అది పెద్ద కష్టం కాదనే చెప్పాలి.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus