విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

తమిళ సూపర్ స్టార్ విజయ్-అట్లీల కాంబినేషన్ లో “తెరి” (తెలుగులో పోలీసోడు), “మెర్సల్” (అదిరింది) లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత.. ఆ కాంబినేషన్ లో రూపొందిన మూడో చిత్రం “బిగిల్”. ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో “విజిల్”గా అనువాదరూపంలో విడుదలైంది. విజయ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంపై తెలుగులోనూ మంచి అంచనాలున్నాయి. మరి విజయ్-అట్లీ మ్యాజిక్ మరోసారి రిపీట్ అయ్యిందా లేదా అనేది చూద్దాం..!!

కథ: నేషనల్ లెవల్ ఫుట్బాల్ ప్లేయర్ మైఖేల్ (విజయ్). ఫుట్ బాల్ లో త్వరలోనే ఇండియాను రీప్రెజంట్ చేస్తాడు అని అందరూ ఎదురుచూస్తున్న టైమ్ లో గేమ్ నుంచి దూరమవుతాడు. కొన్నాళ్ళ తర్వాత అనుకోని విధంగా.. ఉమెన్ ఫుట్ బాల్ టీం కి కెప్టెన్ గా రీఎంట్రీ ఇస్తాడు మైఖేల్. అప్పటివరకూ స్టేట్ లెవల్లో గెలవడానికి కూడా నానా తిప్పలు పడుతున్న టీం ను నేషనల్ లెవల్ గేమ్ విన్నర్స్ గా తీర్చిదిద్దుతాడు.

అసలు మైఖేల్ ఫుట్ బాల్ కు ఎందుకు దూరమవుతాడు? మళ్ళీ కోచ్ గా ఎందుకు రీఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. ఇందులో మైఖేల్ తండ్రి రాయప్ప (విజయ్) పాత్ర ఎంతవరకు ఉంది? అనేది “విజిల్” సినిమా చూసి నేర్చుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: మైఖేల్ పాత్రలో విజయ్ రెగ్యులర్ గానే కనిపించాడు కానీ.. రాయప్ప పాత్రలో విజయ్ మాత్రం నాయకుడు సినిమాలో కమల్ హాసన్ క్యారెక్టర్ ను గుర్తుకు చేస్తుంది. ఆ క్యారెక్టర్ ఎలివేషన్ కు విజయ్ పెర్ఫార్మెన్స్ బాగా సూట్ అయ్యింది. అయితే.. రాయప్ప పాత్రకు ఉన్న క్యారెక్టర్ ఆర్క్.. మైఖేల్ కు లేకుండాపోయింది. దాంతో.. వరుసబెట్టి వచ్చే ఫైట్లు, ఎలివేషన్ సీన్స్ ఉంటాయి తప్పితే.. మైఖేల్ క్యారెక్టర్ కు ఒక క్యారెక్టరైజేషన్ అనేది ఉండదు. దాంతో సెకండాఫ్ సినిమా చాలా బోర్ కొడుతుంది.

నయనతార మరియు ఫుట్ బాల్ ప్లేయర్స్ గా నటించిన 12 మంది అమ్మాయిలకు స్క్రీన్ ప్రెజన్స్ ఉంది కానీ.. క్యారెక్టర్స్ కు డెప్త్ ఎలివేషన్ ఇవ్వలేదు. జాకీ ష్రాఫ్ పెద్ద తరహా పాత్రకు వేల్యూ తీసుకొచ్చాడు. వివేక్, యోగిబాబు కామెడీ పర్వాలేదు.

సాంకేతికవర్గం పనితీరు: ఎ.ఆర్.రెహమాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. ఒక సాధారణ సన్నివేశం కూడా రెహమాన్ మ్యూజికల్ ఎలివేషన్ తో విపరీతమైన ఎమోషన్ ను ఎలివేట్ చేసింది. ఆడియన్స్ సినిమాకి కనెక్ట్ అవ్వడానికి రెహమాన్ సంగీతం చాలా ప్లస్ అయ్యింది. పాటలు తమిళ ప్రేక్షకులని అలరించినంతగా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం కాస్త కష్టమే.

జి.కె.విష్ణు సినిమాటోగ్రఫీ ఫైట్స్ వరకూ పర్వాలేదు కానీ.. ఫుట్ బాల్ మ్యాచులను మాత్రం సరిగా డీల్ చేయలేకపోయాడు. ఆ గ్రాఫిక్స్ కూడా చాలా పేలవంగా ఉన్నాయి. కొన్ని కిక్ షాట్స్ & గోల్స్ గ్రాఫిక్స్ బాగోలేవు.

దర్శకుడు అట్లీ తన సినిమాల కోసం మణిరత్నం నుంచి భారీగా స్పూర్తి పొందుతూ ఉంటాడు. “విజిల్”కి కూడా అదే తరహాలో మణిరత్నం “నాయకుడు” సినిమా నుంచి భారీగా స్పూర్తి పొందాడు. రాయప్ప క్యారెక్టర్ ఆర్క్ చూస్తే ఒక మినీ నాయకుడు సినిమాలా అనిపిస్తుంది. ఇక మైఖేల్ క్యారెక్టర్ విషయంలో అట్లీ “చెక్ దే ఇండియా”ను స్ఫూర్తిగా తీసుకొన్నాడు. అయితే.. ఆ క్యారెక్టర్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ చూపించాల్సింది. 12 మంది లేడీ ఫుట్ బాల్ ప్లేయర్స్ పాత్రల నుంచి మంచి సెంటిమెంట్ ను వర్కవుట్ చేశాడు కానీ.. ఆ ఫుట్ బాల్ మ్యాచులు మరీ సాగదీతలా అనిపిస్తాయి. హీరో ఎలివేషన్స్ & ఫైట్స్ ఎంజాయ్ చేసే మాస్ ఆడియన్స్ ను ఈ చిత్రం బాగా ఆకట్టుకొంటుంది. విజయ్ ఫ్యాన్స్ కి ఈ సినిమా విశేషంగా నచ్చుతుంది.

విశ్లేషణ: ఒక కమర్షియల్ సినిమాకి కథనం, అది కూడా ఫాస్ట్ పేస్ అనేది చాలా కీలకం. అట్లీ ఆ విషయంలో ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. సెంటిమెంట్ సీన్స్ ను మరీ ఎక్కువగా డ్రాగ్ చేస్తాడు. అందువల్ల రన్ టైమ్ పెరగడం తప్ప వేరే ఉపయోగం ఉండదు. ఈ విషయాన్ని అట్లీ గ్రహిస్తే అతడి నెక్స్ట్ సినిమా ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా ఉంటుంది. ఇక “విజిల్” లేడీ సెంటిమెంట్ ను గట్టిగా వర్కవుట్ చేసుకున్న ఒక కమర్షియల్ మసాలా సినిమా.

రేటింగ్: 2.5/5

Click Here To Read in ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus