Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

ఇండియన్‌ సినిమాలో ‘డర్టీ పిక్చర్‌’ తీసుకొచ్చిన సంచలనం మామూలుది కాదు. అప్పటివరకు ఎన్నో జీవిత కథలు తెరకెక్కినా ‘డర్టీ పిక్చర్‌’ సంగతి వేరు. బాలీవుడ్‌లో ఆ మాటకొస్తే ఇండియన్‌ సినిమా మొత్తంలో సినిమా పెద్దలు చాలామంది చర్చించుకోవడానికి కూడా ఆసక్తి చూపించని, ఆలోచించని దివంగత ప్రముఖ నటి సిల్క్‌ స్మిత జీవితం ఆధారంగా ఆ సినిమాను తెరకెక్కించి షాక్‌ ఇచ్చింది బాలాజీ టెలీఫిల్మ్స్‌. ఆ పని చేసింది ఏక్తా కపూర్‌.

Dirty Picture 2

ఇప్పుడు ఆ పాత విషయం గురించి ఎందుకు అంటే.. ఇటీవల ఈ సినిమా నిర్మాణ సంస్థ మరోసారి తాము ‘డర్టీ పిక్చర్‌’ను తీసుకొస్తున్నాం అని ప్రకటిచింది. అలా అన్నారని రీరిలీజ్‌ అనుకోవద్దు. ‘డర్టీ పిక్చర్‌ 2’ సినిమాను తీసుకొస్తున్నామని ప్రకటించారు. అయితే ఈ సారి ఎవరి కథను సినిమాగా తీయబోతున్నారు అని నిర్మాత ఏక్తా కపూర్‌ చెప్పలేదు. ‘డర్టీ పిక్చర్‌’ అని పేరు పెట్టారు కాబట్టి కచ్చితంగా సినిమా నటి కథనే సినిమాగా తీసుకు రాబోతున్నారు.

ఆ నటి ఎవరు అనే చర్చ ఓవైపు నడుస్తుండగానే.. మరో చర్చ బాలీవుడ్‌ వర్గాల్లో మొదలైంది. అదే ఈ సినిమాలో నటించే కథానాయిక ఎవరు అని? ఎందుకంటే అప్పటివరకు హిట్‌ హీరోయిన్‌ అని మాత్రమే పేరు ఉన్న విద్యా బాలన్‌కు ‘డర్టీ పిక్చర్‌’ సినిమాతో స్టార్‌ హీరోయిన్‌ హోదా వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు రెండో ‘డర్టీ పిక్చర్‌’లో నటించేది ఎవరు అనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో రెండు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒక యంగ్‌ హీరోయిన్‌ కాగా, ఇంకొకరు సీనియర్‌ హీరోయిన్‌.

వారే త్రిప్తి డిమ్రీ, తమన్నా. వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూనే యువతను విశేషంగా ఆకట్టుకునే ప్రత్యేక గీతాలతో ఉర్రూతలూగిస్తోంది తమన్నా. మరోవైపు అందం, తనదైన హావభావాలతో ప్రేక్షకుల్ని అలరిస్తోంది త్రిప్తి డిమ్రీ. ఈ ఇద్దరిలో ఎవరు నటించినా ఆ పాత్రకు, సినిమాకు అసెట్‌గానే నిలుస్తారు. ఎందుకంటే ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడంలో ఇద్దరూ ఇద్దరే. అయితే ఏక్తా కపూర్‌ ఇప్పుడు సీనియారిటీకి ఓటేస్తారా? లేక కొత్తందానికే అనేది చూడాలి.

‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus