Harish Shankar: హరీష్ శంకర్ పంచ్ వారికేనా..?

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇండస్ట్రీలో అందరితో చాలా స్నేహంగా ఉంటారు. చిన్నవాళ్లను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అయితే ఓ దర్శకుడు.. అల్లు అరవింద్ కి కోపం తెప్పించినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్ లో సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీన్ని దిల్ రాజు నిర్మించబోతున్నారు. ఈ విషయంలో అల్లు అరవింద్ బాధపడ్డారట. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్.. గీతాఆర్ట్స్ లో చేయాల్సింది. అలా కాకుండా పరశురామ్ యూటర్న్ తీసుకొని దిల్ రాజు దగ్గరకు వెళ్లారు.

దీంతో అరవింద్ ఒక ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నారు. ఈ మేరకు మీడియాకి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. కానీ సడెన్ గా ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసి.. కూర్చొని సెటిల్ చేసుకున్నారు. అయితే ఈ విషయంలో అల్లు అరవింద్ కోపం దిల్ రాజు మీదేనని కొందరు.. కాదు ఆయన పరశురామ్ మీద కోపంగా ఉన్నారంటూ మరికొందరు మాట్లాడుకున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఇన్సిడెంట్ ను ఉద్దేశిస్తూ.. హరీష్ శంకర్ వేసిన పంచ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

అల్లు అరవింద్ నిర్మించిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు హరీష్ శంకర్. తన స్పీచ్ లో భాగంగా అల్లు అరవింద్ ని, బన్నీ వాసుని కొనియాడారు హరీష్ శంకర్. అయితే ఆయన స్పీచ్ లో ద్వందర్థాలు దొర్లాయి. డబ్బులు పెట్టేసి ఫైనల్ కాపీ చూసుకునే నిర్మాతలు ఉంటారు కానీ స్క్రిప్ట్ స్టేజ్ నుండి ఉండే నిర్మాత మాత్రం అల్లు అరవింద్ గారేనంటూ చెప్పుకొచ్చారు హరీష్. అలాంటి నిర్మాతలు ఫ్రెండ్స్ గా ఉండడం మన అదృష్టమని..

అలాంటి ఫ్రెండ్స్ ను ఎవరైనా దూరం చేసుకుంటే అది వారి దురదృష్టం అని అన్నారు. ఇంతకంటే ఏమీ చెప్పలేనని అన్నారు. హరీష్ శంకర్ కావాలనే ఈ కామెంట్ చేశారని.. అరవింద్ ని దూరం చేసుకోవడం దురదృష్టమని తన తోటి డైరెక్టర్ కి చెబుతున్నట్లు ఉందని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus