‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత నాగవంశీ (Suryadevara Naga Vamsi).. చాలా మందికి సుపరిచితమే. ఏడాదిలో ఈ బ్యానర్ నుండే ఎక్కువ సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. కాబట్టి.. నాగవంశీ ఎక్కువగా మీడియా ముందుకు వస్తుంటారు. పైగా ఈయన డిస్ట్రిబ్యూటర్ గా కూడా మారారు కాబట్టి.. పక్క సినిమాల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. నాగవంశీ కామెంట్స్ కొన్నిసార్లు సెన్సిబుల్ గా అనిపిస్తాయి. ఇంకొన్నిసార్లు ఓవర్ ది టాప్ అనిపిస్తాయి. ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) రిలీజ్ కి ముందు ఆ సినిమాకి నాగవంశీ ఇచ్చిన హైప్ అంతా ఇంతా కాదు.
ఒక పాట బాలేదు అని మహేష్ (Mahesh Babu) ఫ్యాన్స్ టీంని తిట్టిపోస్తుంటే.. నాగవంశీ వాళ్ళ పై మండి పడుతూ ట్వీట్ వేశారు. ఆ తర్వాత ఇంకా ఎక్కువగా ట్రోలింగ్ ఫేస్ చేశారు. ఇక సినిమా రిలీజ్ తర్వాత నాగవంశీ పడ్డ ఇబ్బంది అంతా ఇంతా కాదు..! సరే.. ఆ విషయాలు పక్కన పెట్టేద్దాం. నాగవంశీ నిర్మాణంలో రూపొందిన ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సందర్భంగా ఆ సినిమాని తన వంతు ప్రమోట్ చేస్తున్నాడు నాగవంశీ.
ఈ క్రమంలో అతను ఇచ్చే ఇంటర్వ్యూల్లో ఓ పాయింట్ ని ఎక్కువగా మాట్లాడుతున్నాడు. అదేంటంటే.. ‘భవిష్యత్తులో పెద్ద సినిమాలకి పాజిటివ్ టాక్ రాదు.. కావాలనే నెగిటివ్ చెబుతారు’ అనేది అతని అభిప్రాయం. అది కొంతవరకు నిజం. కానీ దాని కోసం అతను చెప్పే ఉదాహరణలు రీజనబుల్ గా లేవు. ‘గుంటూరు కారం’ ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) ‘దేవర’ (Devara) వంటి సినిమాలకి నెగిటివ్ టాక్ వచ్చిందని..
కానీ అవి బాగా ఆదాయనేది నాగవంశీ వాదన. అయితే ఈ లిస్ట్ లో ‘కల్కి..’ కి నెగిటివ్ టాక్ ఏమీ రాలేదు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ గానే స్పందించారు. రివ్యూస్ కూడా పాజిటివ్ గా వచ్చాయి. నాగవంశీ వాటిని గమనించలేదా? లేక యూట్యూబ్లో సినిమాలు చూసి లాజిక్..ల గురించి మాట్లాడే ఇన్ఫ్లుయెన్సర్ల గురించి అతను ఇలా స్పందిస్తున్నాడా? అనేది అంతుచిక్కని ప్రశ్న?