Funky: ‘ఫంకీ’ ఎవరి కథ.. అనుదీప్‌ జీవితమా? విశ్వక్‌సేన్‌ లైఫా?

విశ్వక్‌సేన్‌ – అనుదీప్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుంది అనే వార్తలు వచ్చినప్పుడు వినిపించిన మాట ‘ఈ కాంబో హిలేరియస్‌’ అని. ఎందుకంటే అనుదీప్‌ రైటింగ్‌ టైమింగ్‌.. విశ్వక్‌సేన్‌ డిఫరెంట్‌ బాడీ లాంగ్వేజ్‌ కలగలిపి కొత్తగా అనిపిస్తాయి. అయితే ఈ సినిమా పట్టాలెక్కి టీజర్‌ వచ్చేలోపు పరిస్థితులు మారిపోయాయి. విశ్వక్‌సేన్‌ విన్నింగ్‌ స్ట్రీక్‌లో లేడు. కానీ సినిమా టీజర్‌ వచ్చాక మొత్తం పరిస్థితులు మారిపోయాయి. అనుదీప్‌ రైటింగ్‌, విశ్వక్‌ టైమింగ్‌ కేక అని రివ్యూలు వస్తున్నాయి. అయితే ఇక్కడే మరో ప్రశ్న వినిపిస్తోంది.

Funky

అదే.. ఈ సినిమా ఏమన్నా దర్శకుడు జీవిత చరిత్రనా అని. ఎందుకంటే ఈ సినిమాలో విశ్వక్‌సేన్‌ ఓ దర్శకుడిలా కనిపించబోతున్నాడు. ఆయన సినిమాలో నటించే హీరోయిన్‌గా కయాదు లోహర్‌ నటిస్తోంది. విశ్వక్‌, కయాదు మధ్య వచ్చే సీన్స్‌ హిలేరియస్‌గా ఉండనున్నాయి అనేది టీజర్‌ చూస్తే తెలుస్తోంది. సినిమా సెట్స్‌లో ఈ సినిమా అంతా సాగకుండా ఓ యువ దర్శకుడి జీవితం ఎలా సాగింది అనే విషయాలు చూపిస్తున్నట్లుగా అర్థమవుతోంది.

దీంతో, ఇక్కడ ఒకటే డౌట్‌. ఈ సినిమా కథ ఎవరి జీవితం అని. ఎందుకంటే ఇటు అనుదీప్‌, అటు విశ్వక్‌సేన్‌ ఇద్దరూ దర్శకులే. విశ్వక్‌ పూర్తి స్థాయి దర్శకుడు కాకపోయినా కెప్టెన్‌గా మెగాఫోన్‌ పట్టుకున్నవాడే. అలాగే ఇద్దరూ రియల్‌ లైఫ్‌లో ఇలా సెటైరికల్‌ మోడ్‌లోనే ఉంటారు. దీంతో ఇద్దరూ కలసి సినిమా పరిశ్రమలో ఓ యువ దర్శకుడి స్ట్రగుల్స్‌, సరదా సీన్స్‌ని ‘ఫంకీ’గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు అనిపిస్తోంది. సినిమా విడుదలకు ముందు ఇంటర్వ్యూల్లో ఈ విషయంలో క్లారిటీ వస్తుందనిపిస్తోంది.

ఇక ఈ టీజర్‌లో చూస్తే.. ‘‘చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలు వినలేదు మనం అని ఒక నటి అంటే.. పక్కనున్న మరో నటి ఏం చెప్పింది? అని అడుడుతుంది. దానికి ఆమె తిరిగి చెప్పా కదా వినలేదు అని’’ అనుదీప్ మార్క్ పంచ్‌తో టీజర్ ఓపెన్ అయ్యింది. అక్కడ మొదలైన నవ్వుల ప్రయాణం.. ఆ తర్వాత సెకను సెకనుకు అనుదీప్‌ మార్క్‌ పంచ్‌లు పడుతూనే ఉన్నాయి.

మొన్న రెమ్యూనరేషన్‌.. ఇప్పుడు టైమ్‌.. దీపిక రెయిజ్‌ చేసిన పాయింట్‌కి రిప్లై ఎవరిస్తారు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus