Deepika Padukone: మొన్న రెమ్యూనరేషన్‌.. ఇప్పుడు టైమ్‌.. దీపిక రెయిజ్‌ చేసిన పాయింట్‌కి రిప్లై ఎవరిస్తారు?

బాలీవుడ్‌లో చాలా ఏళ్లుగా ఓ విషయం చర్చల్లో ఉంటూనే ఉంది. ఆ విషయంలో ఎంతో మంది కథానాయికలు మాట్లాడినా ఇంకా వారు చెబుతున్న విషయంలో సరైన నిర్ణయం, పరిష్కారం దొరకలేదు అని చెప్పాలి. అదే పారితోషికం. హీరో హీరోయిన్లకు ఒకేలా పారితోషికం ఉండాలి అని చాలామంది హీరోయిన్లు తమ పీక్‌ కెరీర్‌ అడిగి చర్చ లేవనెత్తారు. కొంతమందైతే హీరోలకు ఇచ్చినంత కాకపోయినా తమకు కూడా ఉత్తమ పారితోషికాలు ఇవ్వాలని కోరారు. అయితే ఎంతమంది అలా వచ్చింది అనేది పక్కనపెడితే.. సినిమా సెట్స్‌లోని సౌకర్యాల విషయంలో అయితే మార్పులు వచ్చాయి అని చెప్పొచ్చు.

Deepika Padukone

ఇంత పెద్ద చర్చ జరిగి.. అంతోకొంత సాధించుకున్న హీరోయిన్లలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపిక పడుకొణె కూడా ఉంది. చాలా ఏళ్ల క్రితమే ఆమె ఈ విషయంలో గొంతెత్తింది. ఇప్పుడు మరో పాయింట్‌ లేవనెత్తింది. నిజానికి ఆమె ఇటీవల రెండు పెద్ద సినిమాల నుండి తప్పుకోవడానికి ఇది కూడా ఓ కారణం అని ఆమెనే చెప్పింది. అదే పని గంటలు. బయట ప్రపంచంలో మరో విధంగా పని గంటల చర్చ నడుస్తుంటే.. దీపికా పడుకొణె మరోలా మాట్లాడింది. సినిమా పరిశ్రమలో హీరోలు కొంతమంది రోజుకు 8 గంటలు మాత్రమే పని చేస్తామని చెబుతున్నారని.. హీరోయిన్లు ఎందుకు అలా చేయకూడదు అని ప్రశ్నించింది.

భారతీయ చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు ఎన్నో ఏళ్లుగా రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తున్నారు. ఇదేం రహస్యం కాదు. అందరికీ తెలిసే జరుగుతోంది. కొంత మంది హీరోలైతే సోమవారం నుండి శుక్రవారం వరకే షూటింగ్‌లలో పాల్గొంటున్నారు. వీకెండ్స్‌లో షూటింగ్‌లకు రారు. కానీ ఇన్నేళ్లలో ఎవరూ ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఇప్పుడు నా విషయంలోనే ఎందుకు రియాక్ట్‌ అవుతున్నారో తెలియడం లేదు. నేను సినిమా పరిశ్రమలో ఇలాంటి విషయాల్లో గతంలో ఎన్నో పోరాటాలు చేశాను. ఇన్నాళ్లలా ఇప్పుడు కూడా ప్రస్తుత విషయాలపై నిశ్శబ్దంగానే పోరాడతాను అంది.

దీంతో ఇన్నాళ్లు పని గంటల విషయంలో రియాక్ట్‌ అయి.. దీపికను విమర్శించిన విశ్లేషకులు, సినిమా పెద్దలు ఇప్పుడు ఏం మాట్లాడతారు, ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. ఎందుకంటే కామ్‌గా ఉన్న దీపికను కదిపారు. మరి ఆమెకు ఆన్సర్‌ కదిపినవాళ్లే చెబుతారా? లేక కొత్తవాళ్లు వస్తారా?

నేనైతే ఎంజాయ్‌ చేస్తున్నా.. త్వరలో మీరూ ఎంజాయ్‌ చేస్తారంటున్న అట్లీ! ఏమొస్తుందబ్బా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus