‘మన శంకర్ వరప్రసాద్ గారు’.. సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎవరూ ఊహించని నాన్ సినిమా సర్‌ప్రైజ్ ఏదైనా ఉందా అంటే.. అది నయనతార మాత్రమే. భర్త విఘ్నేశ్ శివన్ సినిమాలకు తప్ప ఇంకే సినిమాలకూ ప్రచారం చేయని నయన్.. ఈ సినిమా కోసం రెండు ప్రమోషన్ వీడియోలు చేసింది. ఇంకొకటి కూడా చేసింది త్వరలోనే విడుదల అని టాక్. అయితే అసలు ఆమె ఈ వీడియోలు చేయడానికి కారణమేంటి? ఈ మేరకు ఆమెను ఎలా ఒప్పించారు అనేదే ఇక్కడ ప్రశ్న. ఆ మొత్తం క్రెడిట్ అనిల్ రావిపూడికే చెందుతుంది అని చిరంజీవి గొప్పగా చెప్పేశారు. అంతలోనే అనిల్ పరువు తీసేశారు కూడా.
చిరంజీవి సరదాకి అన్నారో, లేక అనుకోకుండా వచ్చిందా, నిజంగా జరిగిందే అన్నారో కానీ.. ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో దీని గురించి చాలాసేపు మాట్లాడారు చిరు. నయనతార ఇప్పటివరకు తనతో రెండు సినిమాలు చేసిందని.. రెండింటిలోనూ సీరియస్ రోల్‌లోనే కనిపిస్తుందని, సెట్స్‌లో కూడా ఎప్పుడూ గుంభనంగా ఉంటూ, తన పని తాను చేసుకొని వెళ్లిపోయేదని.. కానీ ఈ సినిమా విషయానికొచ్చేసరికి ఆమెలో చాలా మార్పు చూశానని చెప్పారు చిరు. దీనంతటి కారణం అనిల్ రావిపూడి అని చెప్పేశారు.
ఆమె ప్రమోషన్ వీడియోలు చేయడం, సెట్స్‌లో అందరితో కలివిడిగా ఉండటం.. ఇవన్నీ చూస్తుంటే అసలు ఆమెకు ఏం చెప్పి ఒప్పించాడో అనిల్ రావిపూడి అర్థం కావడం లేదు అని పదే పదే అన్నారు. అయితే ఈ మాటల మధ్యలో ఆమెను ఒప్పించడానికి అనిల్ ఏమన్నా.. అటు ఇటు చూసి.. అని పాజ్ ఇచ్చారు చిరు. ఈ క్రమంలో కాస్త బాడీ బెండ్ వంగినట్లు చేశారు. అక్కడ ఆయన ఆ పని పూర్తి చేయలేదు కానీ.. చిరంజీవి ఉద్దేశం ఇదీ అంటూ ఓ చర్చ మొదలైంది. అదేంటో మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. నిజానికి అలా జరిగి ఉండే అవకాశం లేదు.
కానీ చిరంజీవి అలా చేసేసరికి లేనిపోని చర్చలకు ఆస్కారం కలుగుతోంది. చిరంజీవి ఇటీవల సినిమా ఫంక్షన్లకు వచ్చి టంగ్ స్లిప్ అవ్వడం జరుగుతోంది. ఆ మధ్య బ్రహ్మానందం సినిమా ఈవెంట్‌కి వెళ్లి ఇలానే టంగ్ స్లిప్ అయ్యారు. ఇప్పుడు మరోసారి ఇంచుమించు అదే పని చేశారు.