Mokshagnya: మోక్షజ్ఞ మూవీ.. 30 మందిని రిజెక్ట్ చేశారట!

నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) వారసుడు మోక్షజ్ఞ (Nandamuri Mokshagnya) త్వరలో హీరోగా సినీ ప్రయాణం ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ వర్మ (Prasanth Varma)  దర్శకత్వంలో మోక్షజ్ఞ తొలి చిత్రం రూపొందనుండగా, డిసెంబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ప్రీప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతుండగా, ఈ చిత్రంలో మోక్షజ్ఞకి సరైన హీరోయిన్ ఎంపిక చేసే పనిలో టీమ్ ఉంది. మోక్షజ్ఞ సరసన కొత్త హీరోయిన్ ని ఎంపిక చేయాలనుకొని, ఉత్తరాది నటీమణుల వైపు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు.

Mokshagnya

ఈ క్రమంలో దాదాపు 30 మంది నూతన హీరోయిన్స్ ను ఆడిషన్ చేసినప్పటికీ, ఎవరు పర్ఫెక్ట్ గా అనిపించకపోవడంతో రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. దీంతో కాస్త పరిచయం ఉన్న నటనకు ప్రాధాన్యతనివ్వాలని దర్శకుడు భావిస్తున్నారని సమాచారం. ఈ చిత్రానికి హిందీలో కూడా మంచి మార్కెట్ ఉండాలని బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ కుటుంబం నుంచి వారసురాలిని హీరోయిన్ గా తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

రవీనా టాండన్ కూతురు రషా తడానీ పేరు వినిపించినప్పటికీ, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. అయినప్పటికీ మరో బాలీవుడ్ వారసురాలిని ఎంపిక చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని టాక్. మోక్షజ్ఞ డెబ్యూ కావడం, పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపొందడంతో అతని ఇమేజ్‌కు సరిపోయేలా హీరోయిన్ ఉండాలనే దృక్పథంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సినిమా కథాంశం మైథాలజీ, ప్రస్తుత కల్చర్ కలిపి ఉంటుందట, సూపర్ హీరో కాన్సెప్ట్‌తో సాగనుండగా, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఈ చిత్రంలో పెద్ద ప్రాధాన్యత కలిగి ఉంటుందని సమాచారం. ఈ భారీ బడ్జెట్ మూవీని సుధాకర్ చెరుకూరి  (Sudhakar Cherukuri) , తేజస్విని నందమూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వీటితో పాటు ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ (Hanuman)  సీక్వెల్ ‘జై హనుమాన్’ కూడా త్వరలో ప్రారంభించనున్నాడు.

వారసుడి ఎంట్రీపై ఓ క్లారిటీ ఇచ్చేసిన సూర్య!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus