‘సాహో’ కు ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్లా?

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నభారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’ ఆగస్ట్ 15న విడుదల కానుంది. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘యూవీ.క్రియేషన్స్’ సంస్థ నిర్మిస్తుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. దీంతో ఇప్పటినుండే ప్రమోషన్స్ మొదలు పెట్టాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుండీ మొదటి పాటను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు.

‘సైకో సయాన్’ అంటూ సాగే పాటను త్వరలో విడుదల చేయబోతున్నారు. ఈ పాటలో ప్రభాస్ చాలా స్టైలిష్ గా కనిపించబోతున్నాడట. విడుదల చేసిన పోస్టర్లు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. దీంతో ‘సాహో’ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే విషయం పై క్లారిటీ వస్తుందని అంతా భావించారు. కానీ దర్శకనిర్మాతలు మాత్రం ఒక్కో పాటకి ఒక్కో సంగీత దర్శకుడితో చేయించాలని.. దీంతో పని మొత్తం సులభమవుతుందని ఫిక్సయ్యారట. ఈ క్రమంలో మొదటి పాట ‘సైకో సయాన్’ను బాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తనిష్క్ బాగ్జితో చేయించబోతున్నారని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus