Geetha Arts: అల్లు అరవింద్ పెద్ద సినిమా ఎవరితో? చర్చల్లోకి ఇద్దరు అగ్ర హీరోల పేర్లు!

ఒకప్పుడు వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చిన గీతా ఆర్ట్స్‌ ఈ మధ్య జోరు తగ్గించింది. స్టార్‌ హీరోతో అందులో ఇండస్ట్రీ హిట్‌లు ఇవ్వగలిగే హీరోతో సొంతంగా సినిమా చేయడం మానేసి చాలా రోజులు అయింది. 16 ఏళ్ల క్రితం రామ్‌చరణ్‌తో ‘మగధీర’ సినిమా తీసి ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన గీతా ఆర్ట్స్‌ ఆ తర్వాత అలాంటి సినిమా చేయలేదు. అల్లు అర్జున్‌తో 2011లో ‘బద్రీనాథ్‌’ రూపంలో ఓ సినిమా చేసినా అది ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఇప్పుడు మరోసారి ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చే సినిమా చేయాలని చూస్తోంది.

Geetha Arts

అదేంటి, గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ మీద ఆ తర్వాత పెద్ద హీరోల సినిమాలు వచ్చాయి, భారీ విజయాలు కూడా అందుకున్నాయి కదా అనుకుంటున్నారా. అవును అలాంటి సినిమా వచ్చాయి కానీ అవి వేరే బ్యానర్‌తో కలసి నిర్మించినవే. సోలోగా అయితే లేదు అనే చెప్పాలి. ఇప్పుడు 2026లో ఆ పని చేయాలని అనుకుంటున్నారట. దీని కోసం ఇద్దరు అగ్రహీరోల పేర్లు వినిపిస్తున్నాయి. ఒకరు ఇంటి హీరో అల్లు అర్జున్‌, మరొకరు ఇంటి వ్యక్తిగా ఇటీవల మారిన నందమూరి బాలకృష్ణ.

బాలకృష్ణతో ఓ సినిమా చేయాలని అల్లు అరవింద్‌ ఎప్పటి నుండో అనుకుంటూ ఉన్నారు. కానీ చాలా ప్రయత్నాలు వర్కవుట్‌ కాలేదు. అయితే బోయపాటి శ్రీనుతో కలసి బాలయ్యకు నాన్‌ ‘అఖండ’ సినిమా చేయాలని చూస్తున్నారు. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లని పక్షంలో అల్లు అర్జున్‌తో ఓ స్టార్‌ డైరక్టర్‌తో సోలో సినిమా చేయాలని చూస్తున్నారట. దీని కోసమే బన్నీ ఇటీవల స్టోరీలు, లైన్‌లు తెగ వింటున్నాడని టాక్‌.

మరి అల్లు అరవింద్‌ ప్రయత్నాలు ఈ సారి ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. ఎందుకంటే ఈ ఏడాది కూడా ఇలాంటి ప్రయత్నాలు చేసి ఎంతకీ కథలు ఓకే కాకపోవడంతో ఆ ప్రయత్నాలు విరమించుకుని ఇతర సినిమాలు చేసుకున్నారు.

చిరంజీవి క్లారిటీ ఇచ్చినా.. ట్రోలర్లు రెడీ అవుతున్నారా? ‘క్రింజ్‌’ ని హైలైట్‌ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus