Chiranjeevi: చిరంజీవి క్లారిటీ ఇచ్చినా.. ట్రోలర్లు రెడీ అవుతున్నారా? ‘క్రింజ్‌’ ని హైలైట్‌ చేస్తారా?

ఒకప్పుడు ఏదైనా పెద్ద హీరో సినిమా వస్తోంది అనగానే అటు సినిమా టీమ్‌, ఇటు అభిమానులు రెడీ అయిపోయేవారు. సినిమాకు వీలైనంతవరకు ప్రచారం కల్పించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూసేవారు. అయితే ఇప్పుడు వారితోపాటు మరో టీమ్‌ కూడా రెడీ అవుతోంది. అదే ట్రోలింగ్‌ టీమ్‌. ఎందుకు ట్రోల్‌ చేస్తున్నారు, ఎవరి కోసం ట్రోల్‌ చేస్తున్నారు అనేది తెలియకుండా.. వాళ్లకు నచ్చినట్లుగా మాట్లాడుతూ ఆ సినిమాను, ఆ సినిమా హీరోను తక్కువ చేస్తుంటారు. దీన్ని ఓ ప్యాషన్‌గా తీసుకొని మరీ చేసేస్తున్నారు.

Chiranjeevi

ఇప్పుడు, ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? మొన్నీమధ్య వచ్చిన ‘అఖండ 2: తాండవం’ సినిమాను ఇలా కావాలనే టార్గెట్‌ చేసి మరీ నెగిటివ్‌ రివ్యూలు చెప్పించారు. అయితే సినిమాలో స్టఫ్‌ లేకపోయేసరికి టీమ్‌, బాలకృష్ణ ఫ్యాన్స్‌ కూడా ఆ ట్రోలింగ్‌కి కౌంటర్‌ ఇవ్వలేకపోయారు. అయితే ఇప్పుడు ట్రోలింగ్‌ బ్యాచ్‌ చూపు సంక్రాంతి మీద పడింది. ఎందుకంటే సంక్రాంతికి చిరంజీవి ‘మన శంకర్‌ వరప్రసాద్‌ గారు’ సినిమా రాబోతోంది. దీంతో చిరంజీవి మీద కోపం ఉన్నవాళ్లు యాక్టివ్‌ అవుతున్నారు.

చిరంజీవి ఫ్యాన్స్‌ వర్సెస్‌ బాలకృష్ణ ఫ్యాన్స్‌ అనే పంచాయితీ టాలీవుడ్‌లో ఎన్నో ఏళ్లుగా ఉంది. కాబట్టి ఫ్యానిజం ముసుగులో కొంతమంది బాలకృష్ణ అభిమానుల వైపు నుండి కామెంట్లు చేస్తారు. అది ఎప్పుడూ ఉండేదే. అయితే ఈసారి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు కూడా టార్గెట్‌ చేస్తారు అని చెబుతున్నారు. చిరంజీవిని జగన్‌ అవమానించారు అంటూ చాలామంది మాట్లాడుతున్నా.. చిరంజీవి కామ్‌గా ఉండటం, తనకు ఎలాంటి అవమానం జరగలేదు అని చెప్పడకపోవడమే వారి ఆగ్రహానికి కారణం అని అంటున్నారు.

అయితే, ఇటీవల ఓ సందర్భంలో చిరంజీవి రియాక్ట్ అవుతూ తనను జగన్‌ ఎలాంటి అవమానం చేయలేదు అని చెప్పారు. అయితే ఈ రియాక్షన్‌ లేట్‌ అయింది అనేది వైసీపీ నాయకుల మాట. దీని కోసం దర్శకుడు అనిల్‌ రావిపూడి చాలా ఏళ్లుగా ఎదుర్కొంటున్న క్రింజ్‌ కామెడీ అంశాన్ని తీసుకుంటున్నారని టాక్‌. మరి ఈ ట్రోలింగ్‌ని చిరు టీమ్‌ బలంగా ఎదుర్కొంటుందా? అసలు వైసీపీ వాళ్లు ఆ పని చేస్తారా అనేది చూడాలి.

 ‘ఛాంపియన్’ మూవీని కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 5 కారణాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags