Chiranjeevi: సుకుమార్ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్ ఇచ్చేది ఎవరికి?
- September 28, 2026 / 06:33 PM ISTByFilmy Focus Desk
చిరంజీవితో సినిమా ఓకే చేయించుకోడం ఒక కళ.. దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా పెద్ద కళ. ఈ మాట మీద ఏమన్నా డౌట్ ఉంటే పూరి జగన్నాథ్, వెంకీ కుడుములను ప్రాజెక్ట్‌ల పరిస్థితి చూస్తే సరి. చిరంజీవికి కథ చెప్పే అవకాశాన్ని జాగ్రత్తగా అందిపుచ్చుకున్న ఆ ఇద్దరూ.. ఆ తర్వాత పరిణామాల్లో ఇబ్బందులు పడి సినిమా అవకాశాన్ని జారవిడుచుకున్నారు. ఇప్పటికీ ట్రై చేస్తూనే ఉన్నారు. ఈ జాబితాలో ‘ప్యారడైజ్’ డైరక్టర్ శ్రీకాంత్ ఓదెల కూడా వస్తారా? ఏమో పరిస్థితులు చూస్తే అలానే ఉన్నాయి.
Chiranjeevi
నాని హీరోగా శ్రీకాంత్ తెరకెచ్చించిన ‘ప్యారడైజ్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి అర్థం కాని ఫలితం అందుకుంది. హీరో నాని కూడా ఇదే మాట అన్నారు. అంటే ఊహించని ఫలితం వచ్చింది అన్నారు. ఇలాంటి సమయంలో శ్రీకాంత్ ఓదెల తర్వాతి సినిమా ఛాన్స్ అలానే ఉంటుందా అనే చర్చ మొదలైంది. శ్రీకాంత్ తర్వాతి చిరంజీవితోనే. ఆ మధ్య భారీ రక్తంతో అనౌన్స్ చేశారు కూడా. అయితే ఇప్పుడు ఈ ‘ప్యారడైజ్’ ఫలితం కారణగా అదేమవుతుందో అనే చర్చ మొదలైంది.
‘ప్యారడైజ్’ ఫలితం ఒక్కటే కాదు.. ఆ సినిమా విషయంలో నాని – శ్రీకాంత్‌కి మధ్య జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఇప్పుడు చిరంజీవి సినిమా విషయంలో అడ్డుపడతాయి అని అంటున్నారు. ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు బాగానే వచ్చాయని దాదాపు వారిద్దరూ చెప్పకనే చెప్పారు. అయితే అవి ఈ సినిమా వరకే ఆగిపోతే నెక్స్ట్ చిరు సినిమా ఉంటుంది. లేదంటే చేతులు అయినా మారుతుంది, ఆగనైనా ఆగుతుంది.
మరోవైపు ‘పెద్ది’ దర్శకుడు బుచ్చిబాబు సానా ఓ కథ పట్టుకుని చిరంజీవి చుట్టూ తిరుగుతున్నారు అని ఓ టాక్. మైత్రీ మూవీ మేకర్స్ ఆ సినిమాను నిర్మిస్తుందని సమాచారం. ఈ నేపథ్యంలో సుకుమార్ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి నెక్స్ట్ ఛాన్స్ ఎవరికి ఇస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇద్దరికీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే రెండు కథలూ నచ్చి.. చేద్దాం అనుకుంటూ రెండూ చేసేస్తారు. ఎందుకంటే ‘వాల్తేరు వీరయ్య’కు ముందు దర్శకుడు బాబీ కొల్లికి విజయాలు లేవు. రెండు డిజాస్టర్లు, ఒక ఇబ్బందికర ఫలితం అందుకున్నారు బాబీ. సో ఏదైనా జరగొచ్చు.














