సినిమా ఇండస్ట్రీలో క్రెడిట్స్ షేరింగ్ అనేది చాలా పెద్ద గేమ్. సినిమా హిట్ అయితే హీరో అకౌంట్ లోకి, ఫ్లాప్ అయితే డైరెక్టర్ ఖాతాలోకి తోసేస్తుంటారు. ఇది ఇప్పటివరకు ప్రతి సినిమాలో జరిగిన విషయమే. అయితే.. చాలా రేర్ గా హీరో తన సినిమా సక్సెస్ కి డైరెక్టర్ కి క్రెడిట్ ఇస్తుంటాడు. మహేష్ బాబు ఎప్పడు తన దర్శకులకు పూర్తిస్థాయి క్రెడిట్ ఇస్తాడు. కానీ.. మిగతా హీరోలు మాత్రం చాలా అరుదుగా తమ దర్శకులకు, నిర్మాతలు క్రెడిట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది.
అల్లు అర్జున్ (Allu Arjun) మొట్టమొదటిసారిగా “పుష్ప” (Pushpa) సక్సెస్ మీట్ లో తన కెరీర్ ఎదుగుదలకి మూలకారణంగా సుకుమార్ ను (Sukumar) పేర్కొన్నాడు. అయితే.. పుష్ప2 (Pushpa 2: The Rule) కి మొత్తం సమీకరణలు మారిపోయాయి. ముఖ్యంగా.. అల్లు అర్జున్ ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ గా నిలిచాడు. ముఖ్యంగా ఈ సినిమా నార్త్ ప్రమోషన్స్ కి అల్లు అర్జున్ ఫేస్ ఆఫ్ ది మూవీగా మారాడు. నిజానికి సుకుమార్ 2018 నుండి పుష్ప మీదే కూర్చున్నాడు. ఈ ఆరేళ్లల్లో సుకుమార్ తీసిన సినిమాలు రెండే. ఇంకా చెప్పాలంటే అల్లు అర్జున్ ఈ సినిమా కోసం ఇచ్చిన టైమ్ మూడున్నర ఏళ్లే.
అయితే.. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉండడం వల్ల సుకుమార్ ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ కి కూడా అటెండ్ అవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ తోపాటుగా సుకుమార్ మార్క్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ.. నార్త్ లో ఎవరికీ పెద్దగా సుకుమార్ తెలియదు. మరి సినిమా రిలీజ్ అయ్యి నిజంగా బాహుబలి (Baahubali) రికార్డ్స్ బ్రేక్ చేస్తే గనుక సుకుమార్ కి క్రెడిట్ ఇస్తారా లేక అల్లు అర్జున్ ఖాతాలోకే తోసేస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.