రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, కియారా అద్వానీ (Kiara Advani), అంజలి (Anjali) ఫీమేల్ లీడ్‌లో నటిస్తున్న గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా ఫ్యాన్స్ లో మంచి అంచనాలు సృష్టిస్తోంది. శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్, పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 2025 జనవరి 10న విడుదల కానున్న ఈ సినిమాపై పలు గాసిప్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రస్తుతానికి గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు గట్టిగా సాగుతున్నప్పటికీ, దీనికి సంబంధించి ఒక కొత్త టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమా ఒకే భాగంగా విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు గేమ్ ఛేంజర్ 2 అనేది కూడా ఉండబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాలు సాధించిన విజయాలతో, మేకర్స్ దృష్టిలో పార్ట్ 2 తీసే ఉద్దేశ్యం పెరిగింది. గేమ్ ఛేంజర్ సినిమా కూడా అదే దారిలో రెండు పార్టులుగా ఈ కథను తీస్తారని భావిస్తున్నారు. లేదంటే దర్శకుడు సెకండ్ పార్ట్ కు లీడ్ తీసుకునేలా క్లయిమాక్స్ లో ఏదైనా ట్విస్ట్ ఇస్తాడా అనేది అందరిలో ఆసక్తిని రేపుతోంది.
అసలే ఇండియన్ 2 తో ఊహించని విధంగా డిజాస్టర్ ను చూసిన శంకర్ ఈసారి గేమ్ ఛేంజర్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఈ సినిమా కథ శంకర్ సొంతంగా రాసుకోలేదు. యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు (Karthik Subbaraj) ఈ కథను అందించాడు. ఇక సీక్వెల్ గాసిప్ ఎంతవరకు నిజం అనేది తెలియాలి అంటే మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సిందే. ప్రస్తుతం, రామ్ చరణ్ బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నాడు, తర్వాత సుకుమార్‌తో ఒక ప్రాజెక్ట్ కూడా ఉంది.
ఈ రెండింటి తరువాత గేమ్ ఛేంజర్-2 చేసే అవకాశం ఉందని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. ఫ్యాన్స్ మాత్రం జనవరి 10న వచ్చే ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల గేమ్ ఛేంజర్ పై ఉన్న అంచనాలు మరింత పెరిగినట్లుగా కనిపిస్తున్నాయి. అంతకుముందు అప్డేట్స్ పెద్దగా క్లిక్కవ్వలేదు. కానీ రిలీజ్ డేట్ కు దగ్గరలో ఉండగా బజ్ పెరుగుతోంది. మరి సినిమా కంటెంట్ ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.