దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, ప్రభాస్ కామినేషన్లో వచ్చిన “బాహుబలి : బిగినింగ్” కలక్షన్ల సునామీ సృష్టించింది. దీనికి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి కంక్లూజన్ విడుదలకు ముందే రికార్డులను నెలకొల్పుతోంది. జక్కన్నపైన నమ్మకంతో, మూవీకి ఉన్న క్రేజ్ ని బట్టి అధిక ధరకు బాహుబలి 2 థియేటర్ హక్కులను కోట్లు కుమ్మరించి కొనుగోలు చేస్తున్నారు. నైజాం(తెలంగాణ) ఏరియా హక్కులను ఏషియన్ ఎంటర్ ప్రయిజెస్ అధినేతలు నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్ లు 50 కోట్లకు దక్కించుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ థియేటర్ హక్కులను నిర్మాత సాయి కొర్రపాటి భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నారు. ఈ మూవీ తెలుగు భాషలోనే కాదు హిందీ భాషలోనూ రెట్టింపు ధర పలికింది.
కరణ్ జోహార్ సారథ్యంలోని ధర్మ ప్రొడక్షన్స్ వారు హిందీ వెర్షన్ హక్కులను 120 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తాజా సమాచారం. ఒక తెలుగు చిత్రానికి హిందీ వెర్షన్ ఇంతరేటు పలకడం ఇదే తొలిసారి. బాహుబలి 1 కి అధిక లాభాలు రావడంతో ఇంతమొత్తం ఇవ్వడానికి వారు ముందుకు వచ్చారని ఫిల్మ్ నగర్ వాసులు చెబుతున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్ దశలోనే వార్తల్లో నిలుస్తున్న బాహుబలి రెండో పార్ట్, థియేటర్లోకి వచ్చిన తర్వాత ఇంకెంత సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.