F3 లో స్టార్ హీరో ఎవరో తెలుసా..?

F2 సినిమాతో ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ని చూపించిన అనిల్ రావిపూడి ఆ తర్వాత మహేష్ తో సరిలేరు నీకెవ్వరూ అంటూ బాక్సీఫీస్ దగ్గర కమర్షియల్ హిట్ కొట్టాడు. ఎన్ని ఆఫర్లు వస్తున్నా సరే కాదని, ఎఫ్ 3 సినిమా చేయడానికి స్క్రిప్ట్ రెడీ చేసుకుని మరీ రంగంలోకి దిగాడు. ఇప్పుడు ఈసినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఎఫ్ 2లో ఉన్న స్టార్ కాస్టింగ్ నే ఆల్ మోస్ట్ రిపీట్ చేస్తూ చేస్తున్న సినిమా ఇది. అయితే, పస్ట్ నుంచీ కూడా ఇందులో ఒక స్టార్ హీరో ఉంటాడు అనే వార్తలు అయితే వినిపించాయి.

మొదట్లో ఈ సినిమాలో రవితేజ ఉంటున్నాడని టాక్ కూడా వచ్చింది. ఆ తర్వాత రవితేజ చేయడం లేదని తేల్చి చెప్పేశాడు. అయితే, ఇప్పుడు ఫిల్మీ ఫోకస్ కి ఎక్స్ క్లూజివ్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఎఫ్ 3 సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడట. మరి క్యామియో మాత్రమే ఇస్తున్నాడా లేదా గెస్ట్ రోల్ చేస్తున్నాడా లేదా ఫుల్ లెంగ్త్ రోల్ లో నటిస్తున్నాడా అనేది ఇంకా తెలియట్లేదు కానీ, కళ్యాణ్ రామ్ అయితే ఖచ్చితంగా సినిమాలో కనిపిస్తాడనే చెప్తున్నారు.

అంతకుముందు అనిల్ రావిపూడితో కలిసి కళ్యాణ్ రామ్ పటాస్ సినిమా చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ సక్సెస్ అయ్యింది. అందుకే, అనిల్ రావిపూడి కోసం నటించేందుకు కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ రావణ్ అనే ప్రాజెక్ట్ కి కమిట్ అయిన సంగతి తెలిసిందే. మొత్తానికి అదీమేటర్.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus