కొంతమంది నటులు కొంతమంది దర్శకుల సినిమాల్లో కచ్చితంగా కనిపిస్తారు. మిగిలిన సినిమాల్లో పెద్దగా కనిపించరు. ఈ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటే కచ్చితంగా గుర్తొచ్చే పేరు శేఖర్. ఇలా చెబితే అందరికీ ఠక్కున గుర్తుకురాకపోవచ్చు. ‘ఛత్రపతి’ శేఖర్ (Chatrapathi Sekhar) అంటే ఈజీగా గుర్తొస్తాడు. ఆయన కచ్చితంగా రాజమౌళి ( (S. S. Rajamouli)) తెరకెక్కించే సినిమాల్లో ఉంటాడు. ఏదో సైడ్ క్యారెక్టర్‌లా కాకుండా.. కాస్త ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలే చేస్తుంటారు. అసలెందుకు, ఎలా కుదరిందీ జోడీ అనే డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా? అయితే ఆయన సమాధానం చదివేయండి.
రాజమౌళి రూపొందించిన ‘శాంతి నివాసం’ సీరియల్ నుండి రీసెంట్ మూవీ ‘ఆర్‌ఆర్ఆర్’ (RRR) వరకు ప్రతి సినిమాలో ఏదోక పాత్రలో కనిపించారు శేఖర్. రాజమౌళి మొదటి సినిమా ‘స్టూడెంట్ నెంబర్ 1’ (Student No: 1) నుండి ‘సింహాద్రి’ (Simhadri) , ‘సై’ (Sye) , ‘చత్రపతి’ (Chatrapathi) , ‘విక్రమార్కుడు’ (Vikramarkudu) , ‘మగధీర’ (Magadheera) , ‘మర్యాద రామన్న’ (Maryada Ramanna) , ‘ఈగ’ (Eeega) , ‘ఆర్ఆర్ఆర్’ ఇలా అన్ని సినిమాల్లో శేఖర్ నటించారు. రాజమౌళి మొత్తం 12 సినిమాలు తీయగా.. 9 సినిమాల్లో కీలకపాత్రలు పోషించారు శేఖర్.
దీనికి కారణం ఏంటా అని చూస్తే.. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘శాంతి నివాసం’ సీరియల్ సమయంలో శేఖర్‌తో పరిచయం ఏర్పడిందట. అప్పటి నుండి వరుసగా ఆయన సినిమాల్లో నటిస్తూ వస్తున్నారట. అయితే శేఖర్ ఎప్పుడూ రాజమౌళిని అవకాశాల కోసం అడగలేదట. కానీ నటుడిగా తనకు సపోర్ట్ చేయాలనే ఆలోచనతో రాజమౌళి తన సినిమాల్లో అవకాశాలు ఇస్తుంటారని శేఖర్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.
ఏదైనా సినిమా స్టార్ట్ చేశాక తనకు పాత్ర ఉందని రాజమౌళి పిలుస్తారని, అప్పటివరకు సినిమా ఏంటి, పాత్ర ఏంటి అనేది తనకు తెలియదని శేఖర్ చెప్పారు. ఈ మాటలు విన్న నెటిజన్లు, రాజమౌళి అభిమానులు.. మొదటి సీరియల్‌లో ఏర్పడిన పరిచయంతో.. ఆ తర్వాత కూడా అవకాశాలు ఇవ్వడం ఎంతైనా గ్రేట్ అంటూ అభినందిస్తున్నారు. ఏదో స్నేహం వచ్చిన అవకాశం కదా అని శేఖర్ నటనలో ఏమైనా తక్కువనా.. అంటే ఏమాత్రం కాదు.