ఏడాదిపాటు జీడిపప్పు పెట్టి మరీ పోషించిన కోడి పుంజు పోటీలో ఒకే దెబ్బకి నేలరాలినట్లుగా.. జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలైన “అజ్ణాతవాసి” మొదటి షో పూర్తయ్యేసరికే డిజాస్టర్ అని తేల్ఛేసారి జనాలు. త్రివిక్రమ్ మ్యాజిక్, పవన్ కళ్యాణ్ స్టార్ డమ్, అనిరుధ్ మ్యూజిక్, కీర్తి సురేష్, అను ఎమ్మాన్యూల్ అందాలు ఏవీ “అజ్ణాతవాసి”ని ఆదుకోలేకపోయాయి. ఆఖరికి ప్రేక్షకుల్ని మళ్ళీ థియేటర్లకి తీసుకురావడం కోసం వెంకీ నటించిన సన్నివేశాలను యాడ్ చేశామని దర్శకనిర్మాతలు పబ్లిసిటీ చేయాల్సి వచ్చింది.
అయితే.. ఇదంతా కాకుండా ఇంకొక్క కోటి రూపాయలు ఖర్చు చేసి ఉంటే “అజ్ణాతవాసి” సూపర్ హిట్ అయ్యేదని చెబుతున్నారు సినీ విశ్లేషకులు. దాదాపు 70 కోట్ల రూపాయల ఖర్చు చేసిన సినిమాకి ఇంకో కోటి ఖర్చు చేయడంలో దర్శకనిర్మాతలు ఎందుకు వెనకాడతారు అని కన్ఫ్యూజ్ అవుతున్నారేమో. ఇక్కడ మెయిన్ మేటర్ ఏంటంటే.. “అజ్ణాతవాసి” సినిమా 2008లో విడుదలైన ఫ్రెంచ్ చిత్రం “లార్గో వించ్”కి కాపీ అన్న విషయం తెలిసిందే. ఆ విషయం బాలీవుడ్ మీడియాకి లీకవ్వడంతో అక్షరాలా 1.75 కోట్ల రూపాయలు చెల్లించి కాపీ రైట్ కేస్ నుంచి బయటపడ్డారు పవన్ కళ్యాణ్ & బ్యాచ్. అయితే.. అదేదో ఇంకో కోటి రూపాయలకి సినిమా రీమేక్ రైట్స్ తీసుకొని సీన్ టు సీన్ రీమేక్ చేసినా సినిమా సూపర్ హిట్ అయ్యేది కదా అనే వాదనలు వెల్లడవుతున్నాయి. ఆన్ లైన్ లో “లార్గో వించ్”ను చూసినవాళ్ళందరూ “నిజమే కదా” అని ముక్కునవేలేసుకొంటున్నారు.