బన్నీ అమెరికా పర్యటనలో దాగున్న రహస్యమిదే!

గంగోత్రి నుంచి దువ్వాడ జగన్నాథం వరకు అల్లు అర్జున్ ప్రతి సినిమాలో కొత్తగా కనిపిస్తున్నారు. అందుకే స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ పేరుని నిలబెట్టుకునేందుకు ప్రతి సినిమాకి కష్టపడుతూనే ఉన్నారు. డీజే తర్వాత ప్రముఖ రచయిత వక్కంతం వంశీతో బన్నీ ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ సినిమా చేస్తున్నారు.  దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ సైనికుడిగా కనిపించనున్నారు. అందుకు తగ్గట్టు బాడీని మలుచుకోవడానికి బన్నీ ప్రయత్నిస్తున్నారు.

అందుకోసం ఈ వీకెండ్‌ అమెరికా వెళ్లనున్నారు. నెల రోజుల పాటు అక్కడే జిమ్‌లో వర్కౌట్స్‌ చేస్తూ, ట్రైనర్‌ అడ్వైజ్‌ చేసిన డైట్‌ ఫాలో అవుతారని సమాచారం. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్, బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా అనూ ఇమ్మాన్యుయేల్‌ నటిస్తోంది. శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషించనున్నారు. ఆగస్టు చివరి వారంలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus