Boyapati Srinu: గీతా ఆర్ట్స్‌లో బోయపాటి… హీరో ఎవరో అందుకే చెప్పలేదా?

‘స్కంద’ సినిమా తర్వాత బోయపాటి ప్రోజెక్ట్‌ ఏంటి? గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌, సోషల్‌ మీడియాలో వినిపించిన ప్రశ్న ఇదే. దానికి కారణం ఓ డిజాస్టర్‌ ఇచ్చాక ఆయన నుండి వచ్చి తర్వాతి సినిమా భారీ బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది. ఈ నమ్మకం ఒకటైతే, డిజాస్టర్‌ డెలివరీ చేసినా ఆయనలో మాస్‌ ఎలిమెంట్స్‌ సినిమా చేసే సత్తా ఇంకా ఉంది అని ప్రేక్షకులు, అభిమానులు నమ్మడమే. అయితే అనూహ్య మలుపులు తర్వాత బోయపాటి సినిమా అనౌన్స్‌ అయింది. అయితే హీరో ఎవరు అనేది చెప్పలేదు.

బోయపాటి శ్రీను – అల్లు అరవింద్‌ కాంబినేషన్‌లో సినిమా ఉంటుంది అంటూ గీతా ఆర్ట్స్‌ ఇటీవల ప్రకటించింది. అయితే హీరో ఎవరు అనేది మాత్రం చెప్పలేదు. మామూలుగా బన్నీ ఆ సినిమాలో హీరో అయితే అప్పుడే చెప్పేసేవాళ్లు. అలా కాకుండా ఓ యంగ్‌ హీరోతో సినిమా అంటే అది కూడా చెప్పేసేవాళ్లు. అలా కాకుండా నిర్మాణ సంస్థ పేరు మాత్రమే చెప్పారు అంటే కచ్చితంగా ఓ ఇద్దరో ముగ్గురో హీరోలతో డిస్కషన్‌లో ఉన్నారు అని చెప్పొచ్చు.

‘మాస్‌’ అంటూ అనౌన్స్‌మెంట్‌లో అనౌన్స్‌ చేశారు. ఒకవిధంగా ఈ మాటకు రెండు ఆలోచనలు వస్తాయి. ఒకటి బోయపాటిని మాస్‌ డైరక్టర్‌ అంటారు కాబట్టి అలా పెట్టి ఉండాలి. లేదంటే మాస్‌ హీరోను తీసుకోవాలి. తెలుగులో ఉన్న స్టార్లు అంతా మాసే. అయితే ఇప్పుడు చర్చలోకి వస్తున్న హీరో నందమూరి బాలకృష్ణ. ఆయనతో సినిమా చేయాలని ఎప్పటినుండో అల్లు అరవింద్‌ ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశగా ఈ ప్రాజెక్ట్‌ వెళ్తుందేమో చూడాలి. లేదంటే రవితేజ ఏమన్నా చేస్తారేమో చూడాలి.

నిజానికి బాలయ్య – బోయపాటి (Boyapati Srinu) కాంబినేషన్‌ఓ ‘అఖండ 2’ రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు వేరే నిర్మాణ సంస్థ ‘అఖండ’ సీక్వెల్‌ అంటే ఆ నిర్మాత ఒప్పుకోవాలి. కాబట్టి ఇది వేరే కథ అనుకుందాం. ఒకవేళ బాలయ్య కాకపోతే రవితేజ అయితే ఏ కథ అయినా చేస్తారు. ఆయనకు నచ్చాలి అంతే.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus