సినిమా పోస్టర్ చూసో, టీజర్‌లో ఓ షాట్ చూసో పంచాయితీలు అవుతున్న రోజులివి. మా వాళ్లను అలా అన్నారు, మావోడిని తక్కువ చేశారు అంటూ ఫ్యాన్స్, ప్రేక్షకులు హర్ట్ అవుతున్నారు. నెటిజన్ల పేరుతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ కూడా జరుగుతోంది. వీరందరినీ మనం ఒక కోవలోకి చెప్పాలంటే ‘మనోభావాల బ్యాచ్’ అంటారు. వీళ్లు ఎందుకు హర్ట్ అవుతారో కూడా తెలియదు. అలాంటి ప్రస్తుత కాలంలో మోస్ట్ కాంట్రవర్శీ టాపిక్‌ను సినిమాలో పెట్టడం అవసరమా?
‘ఇప్పుడేమైంది?’ అని మీరు అడిగారు అంటూ (Boys Hostel) ‘బాయ్స్ హాస్టల్’ సినిమా ట్రైలర్ చూడలేదు అని అర్థం. ‘అవును నిజమే కదా అలా ఎందుకు చేశారో?’ అని అన్నారు అంటే మీరు ఆ ట్రైలర్ చూసినట్లే అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మేం చెబుతున్న అంశం ఆ సినిమా గురించి, ఆ సినిమా ట్రైలర్‌లో చూపించిన ఓ డైలాగ్ గురించే. కన్నడలో మంచి విజయం అందుకున్న ‘హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే’ సినిమాను తెలుగులోకి ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో తీసుకొస్తున్నారు.
ఆ ట్రైలర్‌ను ఇటీవల లాంచ్ చేశారు. ‘బేబీ’ సినిమా టీమ్‌ను తీసుకొచ్చి బాగా హంగామా కూడా చేశారు. దానికి రష్మీ గౌతమ్, తరుణ్ భాస్కర్ యాడింగ్ కూడా. వాళ్ల సంగతి పక్కనపెడితే ఆ ట్రైలర్ ఆఖరున ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అంతర్లీనంగా సాగుతున్న ఓ పొలిటికల్ అంశానికి చెందిన డైలాగ్ ఉంది. ఆ విషయం పట్టించుకుంటే ఉంది, పట్టించుకోకపోతే లేదు అని అనొచ్చు కానీ. అసలు ఆ అవకాశం ఎందుకివ్వడం అనేది ఇక్కడ ప్రశ్న. ఇంత చెబుతున్నారు ఆ డైలాగ్ ఏంటి అనేగా మీ డౌట్.
‘మేం ఆంధ్రా వాళ్లం, పక్కా తెలుగోళ్లం, తోపు కాపులురా ఇక్కడ’ అని ఒక కుర్రాడు అంటే, ‘ఒరేయ్ తప్పు తప్పుగా మాట్లాడకు, ఆంధ్రా అంటే కాపులే కాదు, కమ్మోళ్లు కూడా’ అని మరో అబ్బాయి అంటాడు. ఇది మామూలుగా అయితే సగటు ఏపీ వాసి అనుకునే మాటే అనుకుందాం. కానీ ఇప్పడున్న రాజకీయ పరిస్థితుల్లో క్యాస్ట్ కాన్సెప్ట్ ఎందుకు సినిమాలో అనేది చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 26న ఈ సినిమా వస్తోంది. మరి అప్టపి పరిస్థితి ఏంటో చూడాలి.
మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?