Chiranjeevi, Balakrishna: కంగారుగా సినిమాలు చుట్టేస్తారా? ఏ ‘వీర’దో విజయం?

సినిమా స్టార్ట్‌ అయినప్పుడు… ఫలానా తేదీన సినిమా విడుదల చేద్దామని అనుకుంటారు. అయితే మన సినిమాలు చాలావరకు ఆ డేట్ను ఫాలో అవ్వవు. అంటే అనుకున్న సమయానికి రిలీజ్‌ కావు. తీరా రిలీజ్‌ సమయం దగ్గరికొచ్చేటప్పటికి మార్పులు అయిపోతూ ఉంటాయి. కొంతమంది అయితే.. కచ్చితంగా అనుకున్న సమయానికి రావాలని రిలీజ్‌కు ముందు నానా ఇబ్బందులు పడి రిలీజ్‌ చేస్తూ ఉంటారు. అయినా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రెండు తెలుగు సినిమాలకు వచ్చేలా ఉంది అంటున్నారు కాబట్టి.

సంక్రాంతికి సీజన్‌కు పెద్ద హీరోలు రావడం కొత్త విషయమేమీ కాదు. గత కొన్నేళ్లుగా చూస్తుంటే పెద్ద హీరోలు ఆ సీజన్‌ విషయంలో పట్టుబట్టి మరీ సినిమాలు రిలీజ్‌ చేస్తున్నారు. అందుకే ముగ్గురు పెద్ద హీరోలు సంక్రాంతి సీజన్‌కు రావడం చూశాం. అయితే ఈ ఏడాది సంక్రాంతికి రెండు డబుల్‌ బిగ్‌ సినిమాలొచ్చాయి. కానీ వచ్చే ఏడాది ఐదు సినిమాలు వస్తున్నాయి అంటున్నారు. అందులో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’పైనే అందరి చూపూ పడింది.

‘వాల్తేరు వీరయ్య’ సినిమా రిలీజ్‌ సంక్రాంతికే అని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ‘వీర సింహా రెడ్డి’ సినిమాది అయితే మొన్నీమధ్య దీపావళి ముందు టైటిల్‌ రివీల్‌ చేస్తూ చెప్పారు. దీంతో సంక్రాంతి బరి వేడెక్కింది. అంతేకాదు రెండు సినిమాల సెట్స్‌లోనూ వేడి పెరిగిందట. ఎందుకంటే ఇద్దరూ సంక్రాంతికే వస్తాం అన్న తర్వాత ఇప్పుడు ఎవరు వెనక్కి తగ్గినా.. అభిమానులు, ట్రోలర్స్‌ ఊరుకోరు. కాబట్టి అనుకున్న సమయానికి సినిమా వచ్చేలా ప్లాన్స్‌ వేగవంతం చేశారట.

బాలకృష్ణ – గోపీచంద్‌ మలినేని ‘వీర సింహా రెడ్డి’ సినిమాకు ఈ సమస్య పెద్దగా లేదట. సినిమా ఇప్పటికే తుది దశకు వచ్చిందట. నవంబరు, డిసెంబరులో ఈ సినిమా పూర్తి చేసేస్తారు. కానీ చిరంజీవి – బాబి సినిమా ‘వాల్తేరు వీరయ్య’ దగ్గరకు వచ్చేసరికి డిసెంబరు ఆఖరికి పూర్తవుతుంది అంటున్నారు. అలా అయితే ‘గాడ్‌ఫాదర్‌’ పరిస్థితి వస్తుంది. సినిమా రిలీజ్‌ అనగా ఒక వారం ముందు వరకు సినిమా పనులు సాగాయి. దీంతో సరైన ప్రచారం కుదర్లేదు. మరి ‘వాల్తేరు వీరయ్య’ విషయంలో చిరంజీవి ఏం చేస్తారో చూడాలి.

ఇదంతా చూస్తుంటే ముందుగా పొంగల్‌కి వస్తాం అని చిరంజీవి చెప్పిన బాలయ్య సినిమాను లాక్‌ చేశాడా? లేక డిసెంబరు అంటూ లీక్‌లు ఇచ్చి సంక్రాంతి అని డేట్‌ చెప్పి బాలయ్య.. చిరును లాక్‌ చేశాడా అనేది తెలియడం లేదు. అయితే ఈ మెగా వర్సెస్‌ నందమూరి పోరు ఎప్పుడూ ఆసక్తికరమే. విజయం ఎవరిది అనేది ఇక్కడ విషయం.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus