Chiranjeevi: చిరు లైనప్‌ని అలా పెంచేస్తున్నారు ఎందుకో?

చిరంజీవి లైనప్‌లో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి… ఈ విషయం అందరికీ తెలుసు. అయితే ఈ విషయాన్ని చిరంజీవి మరచిపోయారా? అందుకే వరుస పెట్టి కథలు వినేస్తున్నారా? ఆయన జోరు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. నాలుగు సినిమాలు సెట్స్‌ మీద ఉండగానే… మరో మూడు కథలు చర్చలు దశలో ఉన్నాయి అంటున్నారు. దీంతో అసలు ఎందుకు చిరంజీవి ఇలా లైనప్‌ను పెంచేస్తున్నారు అనే ప్రశ్న మొదలైంది. అభిమాన హీరో వరుసగా సినిమాలు చేస్తుంటే ప్రేక్షకులకు చాలా ఆనందంగా ఉంటుంది. వరుస పెట్టి సినిమాలు రిలీజ్‌ అవుతాయనే ఆనందం అది.

అలా చిరంజీవి నుండి ప్రస్తుతం నాలుగు సినిమాలు సెట్స్‌ మీదున్నాయి. ‘ఆచార్య’ విడుదలకు సిద్ధంగా ఉండగా, ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. మరోవైపు ‘భోళాశంకర్‌’, బాబీ డైరక్షన్‌లో సినిమా ఇటీవల మొదలయ్యాయి. దీంతో చిరు చాలా బిజీగా ఉన్నారు. అయితే మరికొన్ని సినిమాలు చర్చల్లో ఉన్నాయనేది టాక్‌. ఆ మధ్య మారుతి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌లో చిరంజీవి ఓ సినిమా చేస్తారని వార్తలొచ్చాయి. అవి నిజం అని మెగా కాంపౌండ్ టాక్‌. ఆ తర్వాత వెంకీ కుడుమల ఓ అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీ కథను చిరంజీవికి వినిపించారట.

దాని మీద ఇంకా చర్చలు సాగుతున్నాయని టాక్‌. ‘అఖండ’ విజయంతో మళ్లీ బోయపాటి శ్రీను చర్చల్లోకి వచ్చాడు. ‘వినయ విధేయ రామ’ తర్వాత చిరంజీవితో బోయపాటి సినిమా రావాల్సింది. అయితే ఆ సినిమా ఫలితం ఈ సినిమాను ఆపేసింది. ఇప్పుడు ‘అఖండ’ విజయం మళ్లీ చిరు సినిమాకు దారులు తెరిచింది అంటున్నారు. మెగా 152 కావాల్సిన సినిమా మెగా 155 అవుతుంది అని అంటున్నారు. ఇదంతా ఓకే వరుసగా చిరంజీవి ఇన్ని కథలు ఎందుకు ఓకే చేసేస్తున్నట్లో. ఆయనే చెప్పాలి మరి. తన సినిమాల లీక్‌ల్లాగా ఇది కూడా చెప్తే బాగుండు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus