Devara: వేరే సినిమా గురించి చెప్పి ‘దేవర 1’ ప్రమోట్‌ చేసుకున్నారా?

ప్రచారంలో ప్రతి సినిమా టీమ్‌కు ఓ స్ట్రాటజీ ఉంటుంది. ముందుగా ఓ ప్లాన్‌ గీసుకొని దానికి తగ్గట్టు చేస్తుంటారు. ఈ క్రమంలో సినిమా గురించి గొప్పగా చెబుతుంటారు. సినిమాలో ఉన్న అంశాల గురించి.. హైలైట్‌ అవుతాయి అని అనుకునే అంశాల గురించి ప్రచారంలో చెబుతుంటారు. దీంతో ప్రేక్షకులు సినిమా మీద ఆసక్తి పెంచుకుని సినిమా చూస్తారు. ప్రమోషన్స్‌లో చెప్పినంత సీన్‌ సినిమాలో లేకపోతే ‘అంతన్నారు.. ఇంతన్నారు’ అంటూ ఓ మాట అనేస్తారు జనాలు.

Devara

కానీ.. ప్రచారంలో ఆ సినిమా గురించి కాకుండా.. వేరే సినిమా గురించి చెబితే ఎలా ఉంటుంది. సినిమా చూశాక ఆ సీన్స్‌ లేకపోతే చాలా కోపం వచ్చేస్తుంది. చెప్పిన అంశాలు అంతో కొంతో ఉంటే ఓకే కానీ.. పూర్తిగా లేకపోతే చాలా కోపం వస్తుంది. ‘దేవర’ (Devara) సినిమా చూశాక అభిమానులు, ప్రేక్షకులు ఇలాంటి ఫీలింగ్‌లోనే ఉన్నారా అంటే అవును అనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే సినిమా ప్రచారంలో టీమ్‌ హైలైట్‌గా చెప్పిన అంశాలు చాలా సినిమాలో కనిపించలేదు.

‘దేవర’ ప్రచారం జరిగిన తీరు, ప్రచారంలో చెప్పిన అంశాలను ఓసారి రివైండ్‌ వేసుకోండి మీకే అర్థమవుతుంది పరిస్థితి ఏంటో. సినిమాలో ఆఖరి 40 నిమిషాలు అస్సలు మిస్‌ అవ్వొద్దు. సినిమాలో హైలైట్‌ అవే అని చెప్పారు. ఆఖరి పది నిమిషాల్లో షార్క్‌ సీన్‌, అండర్‌ వాటర్‌ సీన్‌ తప్ప అంతగా ఏమీ లేవు. దీంతో ఆ సీన్‌ ఎక్కడ అంటున్నారు. ఇక జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor)  ఈ సినిమా కోసం రెండు పేజీల డైలాగ్‌ చెప్పింది అని తారక్‌ (Jr NTR)  చెప్పాడు. అది కూడా సినిమాలో ఎక్కడా కనిపించలేదు.

ఇంకా చెప్పాలంటే సినిమా మొత్తంలో ఆమె డైలాగ్‌లు పేజీ దాటవు అని చెప్పొచ్చు. ఇక మరో విషయం ‘దావూదీ..’ సాంగ్‌. సినిమా ప్రచారంలో ఈ పాట ఎంతటి ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేసిందో మీకు తెలుసు. తారక్‌ స్టెప్పులు, జాన్వీ కపూర్‌ ఒంపుసొంపులు పెద్ద తెర మీద చూద్దాం అంటే పాటను అసలు పెట్టనే లేదు. రెండో పార్టులో ఉంటుంది అంటున్నారు. దీంతో ‘దేవర 2’ విషయాలు పట్టుకుని ‘దేవర 1’ ప్రచారం చేశారు అనే చర్చ జరుగుతోంది.

మెగా హీరో సాయితేజ్ మంచి మనస్సుకు హ్యట్సాఫ్ అనాల్సిందే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus