ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి టైటిల్ ని చిరు ఎందుకు వద్దన్నారు ?

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమాతో పూర్వవైభవాన్ని సొంతం చేసుకున్నారు. ఈ మూవీ విజయం ఇచ్చిన ఉత్సాహంతో 151 సినిమాకు సిద్ధమవుతున్నారు. ఈ ఫిల్మ్ ని కూడా రామ్ చరణే నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ డైరక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయింది. ఇందులో గుర్రం మీద కత్తి ఫైట్ చేయడానికి చిరు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధిన కొత్త విషయం బయటికి వచ్చింది. ఈ సినిమాకి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి అనే టైటిల్ పెట్టడం లేదంట.

కారణం ఏమిటని ఆరాతీస్తే.. ఆ పేరు పెట్టడం వల్ల తెలుగువారు మాత్రమే కనెక్ట్ అవుతారని, ఇతర భాషల్లోనూ విజయం సాధించాలంటే కామన్ టైటిల్ అయితే మంచిదని భావించిన చిరంజీవి ఒక కామన్ టైటిల్ కావాలని డైరక్టర్ కి సూచించినట్లు తెలిసింది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేయనున్నారు. చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus