RaviTeja: సడన్ గా అందరూ జూనియర్ రవితేజలు అయిపోతున్నారే!

సినిమా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ అవుతున్న హీరో లేదా అప్పుడప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న హీరోని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన బడా హీరోతో పోల్చడం అనేది షరా మామూలు. రవితేజ ఎదుగుతున్న టైంలో చిరంజీవిలా ఎదుగుతున్నాడు అన్నారు. నిఖిల్ మొదట్లో ఎక్కువగా రవితేజను ఇమిటేట్ చేస్తున్నట్లుగా ఉండేవాడు. ఆ తర్వాత నానిని రవితేజతో పోల్చారు. ఇప్పుడు కొత్త హీరోలకు నాని ఒక ఎగ్జంప్లరీ హీరో అయ్యాడు.

RaviTeja

అయితే.. ఈమధ్యకాలంలో ఎక్కువగా అందరూ రవితేజతో కంపేర్ చేసుకుంటున్నారు. మొన్న “K-ర్యాంప్” సక్సెస్ మీట్ లో శ్రీనువైట్ల మాట్లాడుతూ కిరణ్ అబ్బవరంను చూస్తుంటే.. కెరీర్ స్టార్టింగ్ లో రవితేజను చూస్తున్నట్లుగా ఉంది అన్నారు. ఇక నిన్న “తెలుసు కదా” సక్సెస్ మీట్ లో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. సిద్ధు జొన్నలగడ్డ మెల్లమెల్లగా రవితేజకి ఆల్టర్నేటివ్ లా తయారవుతున్నాడు అని అన్నాడు.

ఇలా అందరూ రవితేజతో కంపేర్ చేయడం లేదా చేసుకోవడం అనేది ఒకరకంగా మంచిదే అయినా.. వచ్చే వారం రిలీజ్ ఉంది కాబట్టి ఏదో క్యాజువల్ గా ట్రెండ్ కి తగ్గట్లు వాడుకుంటున్నారా? లేక నిజంగానే అలా చూస్తున్నారా అనేది తెలియదు కానీ.. ఇండస్ట్రీలో రవితేజలా కేవలం కష్టాన్ని నమ్ముకుని ఎదిగిన హీరో మరొకరు లేరు, ఒకవేళ వచ్చినా రవితేజ రేంజ్ స్టార్ డం ను ఎంజాయ్ చేయలేరు అనేది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం.

ఇకపోతే.. రవితేజ తాజా చిత్రం “మాస్ జాతర” అక్టోబర్ 31న విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రమోషన్స్ కూడా ఇంటర్వ్యూలు, పాటల రూపంలో మొదలయ్యాయి. ఇంకో రెండ్రోజుల్లో ట్రైలర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు బృందం. రవితేజ “మాస్ జాతర”తో హిట్ కొట్టడం శ్రీలీల, భాను, నాగవంశీ.. ఇలా అందరికీ చాలా ముఖ్యం. మరి రిజల్ట్ ఏమవుతుందో తెలియాలంటే అక్టోబర్ 31 వరకు వెయిట్ చేయాల్సిందే.

చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus