Varun Tej, Nani: వరుస ఫ్లాప్‌లు నానిపై ఫోకస్‌ తగ్గించాయా!

Advertisement

‘గని’ విడుదల తేదీని చిత్రబృందం గతంలో ఘనంగా ప్రకటించింది. అయితే ఏమైందో ఏమో కానీ… ఒక్కసారిగా సినిమాను మూడు వారాలు వాయిదా వేసింది. కొత్త తేదీని డిసెంబరు 24గా ప్రకటించింది. అలా ఇప్పుడు బాక్సాఫీసు బరిలో వరుణ్‌తేజ్‌.. నానితో పోటీపడాల్సి వస్తోంది. అందులో ఏముంది అంటున్నారా… ఎప్పుడో డేట్‌ ప్రకటించేసిన ‘శ్యామ్‌ సింగ రాయ్‌’తో సినిమాతో… ఇప్పుడు ‘గని’ పోటీ ఎందుకు అనేదే ప్రశ్న. డిసెంబరు 3న విడుదల చేస్తామని ‘గని’ టీమ్‌ ముందే చెప్పింది.

దానికి తగ్గట్టే ప్రచారాన్ని షురూ చేసింది కూడా. అయితే ఉన్నట్లుండి డిసెంబరు 2కి ‘అఖండ’ను రిలీజ్‌ చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సినిమాను ఏకంగా మూడు వారాలు వాయిదా వేశారు. అయితే డిసెంబరు 24న నాని ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ ఉంది. కానీ ‘గని’ టీమ్‌ అదేం పట్టించుకోకుండా విడుదలకు సిద్ధమైంది. దీంతో నానిని వరుణ్‌తేజ్‌ అస్సలు పట్టించుకోవడం లేదా? అంటూ సోషల్‌ మీడియాలో చర్చ రేగింది. నాని సినిమాకు పోటీగా వచ్చి వరుణ్‌తేజ్‌ డేర్‌ చేస్తున్నాడు అంటున్నారు.

‘శ్యామ్‌ సింగ రాయ్‌’ విషయంలో నాని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. అందుకే సినిమాను దక్షిణాది మొత్తం విడుదల చేస్తున్నాడు. మరి ‘గని’ నమ్మకమేంటో చూడాలి. ఇక ‘గని’ ఎందుకు వాయిదా పడిందో కొత్తగా చెప్పక్కర్లేదు అనుకుంటాం.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus