నందమూరి తారకరత్న మరణంతో నందమూరి – నారా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.. గత 23 రోజులుగా బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారక రత్న.. ఫిబ్రవరి 18న కన్నుమూశారు.. కోలుకుని, కొద్ది రోజుల విశ్రాంతి అనంతరం తిరిగి వస్తారనుకున్న కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ వర్గాల వారు భావించారు.. వారి ప్రార్థనలు ఫలించలేదు.. 39 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.. కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ వర్గాల వారు, సినీ పరిశ్రమ వారు, స్నేహితులు, సన్నిహితులు తారక రత్నతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురవుతున్నారు..
బాబాయ్ బాలయ్య, బావలు నారా లోకేష్, నారా రోహిత్, అన్నయ్య నందమూరి చైతన్య కృష్ణ, కళ్యాణ్ రామ్, తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్.. తారక రత్నను అలా నిర్జీవంగా చూసి తట్టుకోలేకపోయారు.. ఈ నేపథ్యంలో.. ‘ఆది’ సినిమా సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మీడియాకిచ్చిన ఇంటర్వూలో తారక రత్న ప్రస్తావన కూడా ఉన్న ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.. ‘‘నందమూరి వంశం నుంచి ఉదయిస్తున్న మరో యువ నటుడు నందమూరి తారక రత్నపై మీ అభిప్రాయం?’’ ఏంటని అడగ్గా..
‘‘నందమూరి వంశం విశ్వ విద్యాలయం లాంటిది.. ఎందరో నటులు ఈ విద్యాలయం నుండి వస్తుంటారు.. ఎంతమంది హీరోలు వచ్చినా నందమూరి వంశ ప్రతిష్ట నిలబెట్టడానికే అని ఇది వరకు పలుమార్లు రుజువైంది.. ఈ విషయాన్ని నా తమ్ముడు తారక రత్న కూడా మరోసారి రుజువు చేయబోతున్నాడు.. హీరోగా నా తమ్ముడు తారక రత్న విజయం సాధిస్తే నేను ఎంతో ఆనందంగా ఫీలవుతాను’’ అని చెప్పుకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్.. అలాగే తాత పేరు మీద బ్యానర్ స్థాపించాలనుకుంటున్నట్టు కూడా అన్నాడు..
‘‘జూనియర్ ఎన్టీఆర్ 1983 మే 20న పుట్టాడు.. తారక రత్న 1983 ఫిబ్రవరి 22న జన్మించాడు.. ఎన్టీఆర్ కంటే తారక్ దాదాపుగా మూడు నెలలు పెద్ద.. మరి అన్నయ్య అవుతాడు కదా.. తమ్ముడు అని ఎలా అన్నాడు?.. ఫ్లో లో అనేసి ఉంటాడులే.. కుటంబానికి దూరంగా ఉన్న సమయంలో కూడా పాజిటివ్‌గా మాట్లాడాడు.. జూనియర్ ఎన్టీఆర్ నిజంగా గ్రేట్’’ అంటూ నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?