Jr NTR: ఎన్టీఆర్‌ కావాలనే చెప్పలేదా? సినిమానే లేదా?

‘ఉప్పెన’ సినిమా విడుదలయ్యాక ఎక్కువగా మాట్లాడుకున్నవారిలో దర్శకుడు బుచ్చిబాబు కూడా ఒకరు. హీరోహీరోయిన్లను పక్కనపెడితే బుచ్చిబాబు టాలెంట్‌ గురించి తెగ మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో తన తర్వాతి సినిమాను ఎన్టీఆర్‌తో చేస్తాడు అని కూడా చెప్పుకున్నారు. ఇందులో ఎన్టీఆర్‌ ప్రయోగం కూడా చేయబోతున్నాడని, 60 ఏళ్ల వృద్ధుడిగా కనిపిస్తాడని కూడా వార్తలొచ్చాయి. అయితే ఆ తర్వాత మళ్లీ ఆ ఊసులేదు. ఇటీవల ఎన్టీఆర్‌ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఎక్కడా ఆ విషయం చెప్పలేదు.

ఎన్టీఆర్ – బుచ్చిబాబు మధ్య మంచి అనుబంధమే ఉంది. ‘నాన్నకు ప్రేమతో’ సినిమా చిత్రీకరణ సమయంలో ఇద్దరూ బాగా క్లోజ్‌ అయ్యారని చాలా సందర్భాల్లో విన్నాం. ఆ అనుబంధంతోనే బుచ్చిబాబు.. ఎన్టీఆర్‌ ఓ కథ చెప్పారని టాక్‌ వచ్చింది. అయితే ఎన్టీఆర్‌ ఇటీవల చెప్పిన ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ లిస్ట్‌లో బుచ్చిబాబు పేరు లేదు. దీంతో ఈ సినిమా ఉందా లేదా అనేది తెలియడం లేదు. ఎన్టీఆర్‌ చెప్పిన ప్రకారం తన తర్వాతి ప్రాజెక్టులు కొరటాల శివ సినిమా, ప్రశాంత్‌ నీల్‌ సినిమా మాత్రమే.

బుచ్చిబాబు తన రెండో సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌కే చేస్తారని వార్తలొస్తున్నాయి. దీని కోసం నిర్మాతలు ఇప్పటికే కొన్ని కథలు విన్నారు కూడా. అందులో ఒకటి ఎన్టీఆర్‌ కోసమని అంటున్నారు. ఈ లెక్కన ఎన్టీఆర్‌ – బుచ్చిబాబు సినిమా ఉంటుందట. అయితే ఎప్పుడు అనేది ఇంకా తేలకపోవడం వల్లే ఎన్టీఆర్‌ చెప్పలేదని టాక్‌. కొరటాల శివ సినిమా అయ్యాక, ప్రశాంత్‌ నీల్‌ సినిమా మొదలవ్వాలి. ఆ మధ్యలో అనుకోని విధంగా ఏదైనా గ్యాప్‌ వస్తే, అప్పుడు బుచ్చిబాబు సినిమా మొదలెడతారనే టాక్‌ కూడా వినిపిస్తోంది.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus