ఒక చిన్న హీరో సినిమాకు ప్రమోషన్ చాలా అవసరం. అదే క్రమంలో పెద్ద హీరో సినిమాకు కూడా ప్రమోషన్ అవసరం. అయితే చిన్న హీరోకు పెద్ద హీరోకు తేడా ఏంటి అంటే….చిన్న హీరోల సినిమాలు ఎంత వీలైతే అంత వరకూ ప్రమోట్ చెయ్యాలి, లేదంటే ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ పెద్ద హీరోల సినిమాలకు అంత అవసరంలేదు. ఎందుాక్ంటే వాళ్ళకు ఇప్పటికే గుళ్ళు కట్టి, అభిమాన సంఘాలు పెట్టి మరీ పూజించే అభిమానులు ఉంటారు. అయితే నేటి కాలంలో ఏ పెద్ద సినిమా తీసుకున్న ఒక పవన్ కల్యాణ్ సర్దార్, మహేష్ బ్రహ్మోత్సవం, ఇప్పుడు తలైవార్ కబాలి ఈ మూడు సినిమాలు డిజాస్టర్స్ గా మారడానికి ప్రధాన కారణం ఈ సినిమాల యొక్క హైప్ ను పెంచే పబ్లిసిటీ. ఆ రెండు సినిమా విషయం పక్కన పెడితే….నేటి కబాలి మాత్రం పోవడానికి కారణం హైప్, భారీ అంచనాలు అని స్పష్టంగా తెలుస్తుంది. విషయంలోకి వెళితే…కబాలి సినిమాని తొలుత చిన్న సినిమాగా ఊహించుకున్న ప్రేక్షకులు తొలి లుక్ కి, తొలి టీజర్ కి ఫిదా అయిపోయి మరీ అంచనాలను భారీగా పెంచేసుకుంటూ…ఇతరులకు కూడా పెంచేశారు.
అదే క్రమంలో ఈ సినిమాకు అన్నీ అలా కలసి వచ్చాయి….టైటిల్ కూడా అద్భుతంగా ఉండడం ఫుల్ జోష్ తో కథ నిండడం చూసి అందరూ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కట్ చేస్తే….చివ్వరికి సినిమా స్లో నేరేషన్ తో అసలు గ్యాంగ్ స్టర్ సినిమా విధంగా సాగకపోవడం ఓవర్ సెంటిమెంట్ జోడించి ఉండడం తో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డమాల్ అని అంది. అంటే ఈ కధ మొత్తం చూస్తే భారీ సినిమాల భారీ పతనానికి కారణం బాగా పెరిగిపోతున్న హైప్ అని ఇట్టే అర్ధం అయిపోతుంది. ఇప్పటికైనా మన సినిమా వాళ్ళు దీన్ని గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.